కరోనా వల్ల ఇంట్లో ఉండి పనిచేయడం అలవాటైపోయింది. దాదాపు చాలా కంపెనీలు తమ ఉద్యోగులందరినీ ఇంటి వద్ద నుండే పనిచేయమంటున్నాయి. భవిష్యత్తులో కూడా ఇదే పద్దతి కొనసాగేలా ఉంది. ఆఫీసుకు వెళ్ళి పని చేయడానికి, ఇంట్లోనే ఉండి పనిచేయడానికి చాలా తేడా ఉంటుంది. కానీ కరోనా కారణంగా ఇంట్లోనే అలవాటయ్యింది. అదీగాక ఇలా పనిచేయడం వల్ల కంపెనీలకి ఎక్కువ లాభాలు ఉన్నాయని అర్థమైంది. అందువల్ల ఇదే కొనసాగవచ్చని అనుకుంటున్నారు.
ఐతే ఇంట్లో ఉండి పనిచేసేవారు ఎలాంటి ఆహారాలు తీసుకోవాలో తెలుసుకుందాం.
ముఖ్యంగా వర్క్ ఫ్రమ్ హోమ్ వల్ల ఇంటి ఆహారం తినగలుగుతున్నాం. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, ఏది తిన్నా సమపాళ్ళలో తినడం బెటర్. పిండి పదార్థాలు, ప్రోటీన్లు, పాల ఉత్పత్తులు మొదలైనవి సమపాళ్ళలో తీసుకోవాలి. ఫిజికల్ వర్క్ చేయకపోవడం వల్ల బరువు పెరిగే అవకాశం ఉంది. అందుకే మన ఆహారంలో బరువు పెరగనివి ఉండకుండా చూసుకోవాలి.
సరైన సమయానికి తినాలి.
టైమ్ ప్రకారం భోజనం చేస్తే అంతకన్నా ఆరోగ్యం ఇంకోటి ఉండదు. మనకొచ్చే చాలా సమస్యలు సరైన సమయానికి భోజనం చేయకపోవడం వల్ల వచ్చేవే. అందుకే టైమ్ కి తినండి.
నీళ్ళు
ఇంట్లోనే ఉంటున్నారు. నీళ్ళు తాగడం తగ్గిపోయే సమస్య ఉంది. కాబట్టి దానిపట్ల శ్రద్ధ వహించండి. కావాల్సినన్ని నీళ్ళు తాగడం ఉత్తమం.
వ్యాయామం
రోజూ ఉదయాన్నో, సాయంత్రం పూటో అరగంట సేపైనా వ్యాయామం చేయడం మర్చిపోవద్దు. ఎక్కువగా కూర్చునే ఉంటారు కాబట్టీ వ్యాయామం ఖచ్చితంగా చేయాలి. కూర్చుని చేసే వ్యాయామాలు కూడా ఉంటాయి.