ఏటిఎం చార్జీలు,శ్మశాన వాటికల జీఎస్టీ పై మంత్రి ఏమన్నారంటే?

-

బ్యాంక్ వినియోగదారులకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గుడ్ న్యూస్ చెప్పింది.ఏటీఎం (ATM) ల నుంచి క్యాష్ విత్ డ్రా చేసే సమయంలో పడే ఛార్జీలపై క్లారిటీ ఇచ్చారు. ఖాతాదారులు నెలకు వారి సొంత బ్యాంక్ ఏటీఎంల నుంచి ఐదు సార్లు, ఇతర బ్యాంకులకు సంబంధించిన ఏటీఎం లనుంచి మరో ఐదు సార్లు ఉచితంగా నగదును ఉపసంహరించుకోవచ్చని తెలిపారు. అంటే ఖాతాదారులు నెలకు 10 ట్రాన్సాక్షన్లను ఏటీఎంల ద్వారా ఉచితంగా నిర్వహించుకో వచ్చునని స్పష్టం చేశారు.

ఈ విషయాన్ని మంత్రి రాజ్యసభలో ఈ రోజు ప్రకటించారు. బ్యాంకుల నుంచి నగదును ఉపసంహరించే సమయంలో ఎలాంటి జీఎస్టీ ఉండబోదని మంత్రి స్పష్టం చేశారు.బ్యాంకుల నుంచి క్యాష్ విత్ డ్రా చేస్తే ఎలాంటి జీఎస్టీ ఉండదని నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. అయితే.. చెక్ బుక్ లపై పన్నులు ఉంటాయన్న వార్తలపై సైతం ఆమె స్పష్టత ఇచ్చారు. ప్రింటర్ నుంచి బ్యాంకులు కొనుగోలు చేసే చెక్ బుక్ లపై జీఎస్టీ ఉంటుందన్నారు.

ఫ్యాక్ చేసిన ఫుడ్ ఐటమ్స్ పై 5 శాతం జీఎస్టీ విధించే ప్రతిపాదనలకు జీఎస్టీ కౌన్సిల్ లోని అన్ని రాష్ట్రాలు అంగీకరించాయని వెల్లడించారు. దేశంలో ధరలు పెరుగుతల అంశంపై రాజ్యసభలో ఈ రోజు జరిగిన స్వల్పకాలిక చర్చపై ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ క్లారిటీ ఇచ్చారు..ఆసుపత్రుల బెడ్, ఐసీయూపై జీఎస్టీ లేదని.. రోజుకు రూ.5000 అద్దె ఉన్న గదిపై మాత్రమే పన్ను వర్తిస్తుందని పేర్కొన్నారు. ద్రవ్యోల్బణం, ధరల పెరుగుదలపై సమాధానమిస్తూ భారత ఆర్థిక వ్యవస్థ ప్రాథమిక అంశాలు బలంగా ఉన్నాయంటూ సీతారామన్ మరోసారి స్పష్టంచేశారు.శ్మశానవాటికలకు జీఎస్టీ లేదని.. కొత్త శ్మశానవాటికల నిర్మాణంపై మాత్రమే పన్ను ఉంటుందని పేర్కొన్నారు..

Read more RELATED
Recommended to you

Latest news