కరోనా దెబ్బకు చైనాకు ఎంత నష్టపోతుందో తెలిస్తే…?

-

అంతర్జాతీయ మార్కెట్ లో చైనా వస్తువులు, వాటి ప్రాధాన్యత ఏ స్థాయిలో ఉంటుందో అందరికి తెలిసిందే. ప్రధానంగా వెనుకబడిన లేదా అభివృద్ధి చెందిన దేశాలకు చైనా ఉత్పత్తులు అనేవి ఎక్కువగా ఎగుమతి అవుతూ ఉంటాయి. జనాభా ఎక్కువగా ఉండే భారత్ సహా ఆఫ్రికా దేశాల్లో చైనా ఉత్పత్తులకు విలువ ఎక్కువగా ఉంటుంది. పది రూపాయల నుంచి వాటి ధర మొదలవుతుంది.

మొబైల్ ఫోన్స్, గృహ అవసరాల వస్తువులు, ఎలక్ట్రానిక్ పరికరాలు, ఇలా ఎన్నో ఉత్పత్తులకు చైనా కేంద్రంగా ఉంది. భారత్ లో వాడే సగం సెల్ ఫోన్స్ చైనా నుంచి వచ్చినవే. వీవో, ఒప్పో, రెడ్ మీ ఇలాంటి ఉత్పత్తులు అన్నీ చైనావే. ఇప్పుడు వీటిని అన్ని దేశాలు కొన్నాళ్ళ పాటు ఆపేశాయి. భారత్ అయితే మిర్చి కూడా అక్కడికి ఎగుమతి చేయడం లేదు అంటే అర్ధం చేసుకోవచ్చు.

దీనితో ఇప్పుడు అంతర్జాతీయ మార్కెట్ లో చైనా భారీగా నష్టాలు చూస్తుంది. తమ ఉత్పత్తుల ఎగుమతులు ఆగిపోవడంతో చైనా ప్రధాన ఆర్ధిక వనరు అనేది ఆగిపోయింది. అంతర్జాతీయంగా అతి పెద్ద ఆర్ధిక శక్తిగా ఉన్న చైనా ఇప్పుడు కోలుకోలేని విధంగా కుదేలు అయిపోతుంది. మరి ఈ పరిస్థితి ఎప్పుడు మారుతుందో, చైనా ఉత్పత్తుల ఎగుమతులు ఎప్పుడు ఊపందుకుంటాయో అని అక్కడి వ్యాపారులు ఎదురు చూస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news