ఇవాళ విపక్షానికి సంబంధించి ఎవరు ఎన్ని అనుకున్నా సరే కేసీఆర్ని మెచ్చుకోవాల్సిందే.. ఎందుకంటే దేశంలో ఏ సీఎం డేర్ చేయని విధంగా కేసీఆర్ డేర్ చేస్తూ ఉంటారు.. ప్రజలకు ఉపయోగపడే పనులు చేయడంలో ఎప్పుడు ముందుంటారు. ఊహించని విధంగా ప్రజలకు మేలు కలిగే పనులు చేస్తారు. రాష్ట్రంలోని రైతులకు రైతుబంధు ఇవ్వాలన్నాఆయనే.. దళితబంధు ఇవ్వాలన్నా ఆయనే. ఇవాళ ఏకంగా 90 వేల పైనే ప్రభుత్వ ఉద్యోగాలని భర్తీ చేయడానికి కేసీఆర్ సిద్ధమయినా ఆయనే!
తెలంగాణ వచ్చాక తొలిసారిగా ఈ స్థాయిలో ఉద్యోగాలని భర్తీ చేస్తున్నారని చెప్పవచ్చు.. ఇందులో రాజకీయ కారణాలు ఏమైనా ఉండనీయండి.. కానీ ఉద్యోగాల భర్తీ వల్ల చాలామంది నిరుద్యోగులకు బెనిఫిట్ అవుతుంది అన్నది అంగీకరించక తప్పని వాస్తవం. ఉద్యోగాలు వస్తే ఆ నిరుద్యోగుల కుటుంబాలు సైతం సంతోషంగా ఉంటాయి. అంటే ఎన్ని రకాలుగా కేసీఆర్ ప్రజలకు మేలు చేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. ఇవే కాదు. ఇంకా ఉద్యోగులకు మేలు చేసే నిర్ణయాలు చాలా తీసుకున్నారు. కాంట్రాక్టు ఉద్యోగులను పర్మినెంట్ చేస్తున్నారు. అదేవిధంగా స్థానికులకు 95 శాతం రిజర్వేషన్లు అమలు చేయడం కూడా మంచి నిర్ణయమే!
ఇక ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే.. అనూహ్యంగా నిరుద్యోగుల వయో పరిమితి పెంచారు. యూనిఫాం బేస్డ్ పోస్టులకు కాకుండా.. మిగతా ఉద్యోగాలకు వయసు పరిమితి పెంచుతున్నట్లు ప్రకటించారు. అత్యధికంగా 10 ఏళ్ల గరిష్ట పరిమితి పెంచుతున్నట్లు తెలిపారు. ఓసీలకు 44ఏళ్ళు, ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 49ఏళ్ళు, దివ్యాంగులకు 54 ఏళ్ళు గరిష్ట వయో పరిమితి లభించనుంది. అంటే దీని వల్ల ఎన్నో ఏళ్లుగా ఉద్యోగాల కోసం నిరీక్షించి వయో పరిమితి దాటిన వారికి చాలా అంటే చాలా బెనిఫిట్ అవుతుంది. చాలామంది నిరుద్యోగులు ఉద్యోగాలు దక్కించుకునే ఛాన్స్ ఉంటుంది. ఏదేమైనా కేసీఆర్ ప్రకటన తెలంగాణ నిరుద్యోగ యువతకు ఒక గొప్ప వరమని చెప్పొచ్చు. మొత్తానికి కేసీఆర్ ప్రకటనతో నిరుద్యోగుల జీవితాల్లో కొత్త వెలుగు వస్తుందనే చెప్పవచ్చు.
– మన లోకం ప్రత్యేకం