బాలీవుడ్ స్టార్స్ ఇంత అందంగా కనిపించడానికి కారణం..?

-

ఇటీవల కాలంలో బాలీవుడ్ స్టార్ హీరోలు రోజు రోజుకు చాలా అందంగా.. స్మార్ట్ గా మారిపోతున్న విషయం తెలిసిందే. అంతేకాదు వీరు తమ ఫ్యాషన్ లుక్ తో యావత్ దేశ సినీ ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేస్తున్నారు. ఇకపోతే బాలీవుడ్ స్టార్ హీరోలు ఇంత అందంగా ఉండడానికి గల కారణం ఏమిటి అనే విషయం కూడా ప్రతి ఒక్కరికి ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. అయితే ఇటీవల జరిగిన ఒక ఇంటర్వ్యూ లో చాలా మంది హీరోలు తాము ఇంత అందంగా ఉండడానికి గల కారణాలను కూడా వెల్లడించారు. ఇకపోతే ఇప్పటికే చాలామంది స్టార్ హీరోయిన్ లు అందంగా ఉండడానికి సర్జరీలు చేయించుకున్న విషయం తెలిసిందే. ఇక వీరి బాటలోనే ప్రస్తుతం స్టార్ హీరోలు కూడా నడుస్తున్నట్లు సమాచారం. ఇక అందం గా మారడానికి బాలీవుడ్ స్టార్ హీరోలు సర్జరీ చేయించుకున్నారు .

అమీర్ ఖాన్:

మిస్టర్ పర్ఫెక్ట్ అనిపించుకుంటున్న అమీర్ ఖాన్ ముఖం పైన ముడతలు తగ్గించుకోవడానికి కాస్మెటిక్ సర్జరీ చేయించుకున్నారు.

అక్షయ్ కుమార్:

బాలీవుడ్ స్టార్ హీరో గా కొనసాగుతున్న అక్షయ్ కుమార్ హెయిర్ ప్లాంటేషన్ చేయించుకున్నాడు.

రణవీర్ కపూర్:

రణబీర్ కపూర్ కూడా ఆలీయాతో వివాహం చేసుకోవడానికి ముందు హెయిర్ ప్లాంటేషన్ చేయించుకున్నాడు.

సల్మాన్ ఖాన్:

బాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో కండలవీరుడు గా గుర్తింపు తెచ్చుకున్న ఈయన హెయిర్ ప్లాంటేషన్ తో పాటు బొటాక్స్ సర్జరీ కూడా చేయించుకున్నాడు.

షాహిద్ కపూర్:

చాక్లెట్ బాయ్ గా గుర్తింపు తెచ్చుకున్న షాహిద్ కపూర్ ముఖానికి ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నారు.

షారుఖ్ ఖాన్:

బాలీవుడ్ బాద్ షా గా గుర్తింపు తెచ్చుకున్న షారుఖ్ ఖాన్ బొటాక్స్ సర్జరీ తో పాటు యంగ్ గా కనిపించడానికి కొన్ని రకాల ఇన్ఫెక్షన్లు కూడా తీసుకుంటున్నట్లు సమాచారం.

సైఫ్ అలీ ఖాన్:

సైఫ్ అలీఖాన్ కూడా బొటాక్స్ సర్జరీ చేయించుకున్నట్లు సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news