పుష్ప, ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్ 2 బ్లాక్ బస్టర్.. ఉత్తరాది నటుల కుతకుత.. సలసల..

-

కిచ్చా సుదీప్ సోదరుడా!
హిందీ మన జాతీయ భాష కానప్పుడు నీ మాతృభాష సినిమాలు హిందీలోకి ఎందుకు డబ్ చేస్తున్నావు? హిందీ అప్పుడు, ఇప్పుడు, ఎపుడూ మన జాతీయ భాష.
(అజయ్ దేవగన్, హిందీ నటుడు)

అజయ్ దేవగన్ సారూ!
హిందీలో నువ్వు పంపిన రాత నా కర్థం అయ్యింది, అది మేం కేవలం గౌరవించి, ప్రేమించి నేర్చుకున్న హిందీ కాబట్టి. ఏమనుకోకండి సారూ, నేను మీలాగా నా సమాధానాన్ని కన్నడలో రాసివుంటే మీ పరిస్తితి ఎట్లా వుండేదని ఆశ్చర్యపడుతున్నాను. ఏం మేం భారతదేశానికి చెందినవారం కాదా సారూ?
(సుదీప్, కన్నడ నటుడు)

 

 

ఇది.. హిందీ నటుడు, కన్నడ నటుడి మధ్య జరిగిన ట్విట్టర్ వార్. ఈ వివాదాన్ని పక్కన పెట్టి.. ఒక నెల వెనక్కి వెళ్తే.. ఆ పరిణామాలను పరిశీలిస్తే.. మనకు ఈ ‘వార్’ మధ్య అసలు గుట్టేమిటో అర్థమవుతుంది. నెల క్రితం కేంద్రం హోంశాఖ మంత్రి అమిత్ షా హిందీ గురించి వ్యాఖ్యలు చేయడం తీవ్ర వివాదాస్పదమైంది. దీనిపై దిగ్గజ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ అయితే ఏకంగా తమిళ భాషతో కూడి ఓ చిత్రాన్ని అత్యంత ఘాటుగానే ట్వీటారు. మరో సంగీత దర్శకుడు ఇళయరాజాగా కుమారుడు యువన్ శంకర్ రాజా కూడా ఇలాగే స్పందించారు. తెలుగుతో పోలిస్తే.. తమిళ, కన్నడ, కేరళ నటులు ఎక్కువగా అమిత్ షా వ్యాఖ్యలకు ఏదో ఒక రకంగా నిరసనలు తెలిపారు.

ఈ సందర్భంలో పుష్ప, ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్ 2 వంటి పాన్ ఇండియా మూవీస్ విడుదలై బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించాయి. వీటి దెబ్బకు బాలీవుడ్ సినిమాలు అడ్రస్ లేకుండా పోయాయి. పుష్ప మానియా అందరికీ తెలిసిందే. ఆర్ఆర్ఆర్ రికార్డులు నెలకొల్పింది. కేజీఎఫ్ 2 ఇంకా రికార్డులు బద్దలు కొడుతూనే ఉంది. ఇలా వరసగా సౌత్ సినిమాలు బాలీవుడ్ మార్కెట్ ఆక్రమించేస్తున్నాయి. వీటి జోరుతో సౌత్ ఇండియా సినిమాలంటేనే బాలీవుడ్ఇం డస్ట్రీ అంతా భయపడే స్థితికి వచ్చేసింది. ఈ సినిమాలకు హిందీ మీడియా ఏమాత్రం ప్రాధాన్యం కూడా ఇవ్వలేదు. కొన్ని రివ్యూ సంస్థలయితే 2 స్టార్ల కన్నా ఎక్కువ ఇయ్యలేదు. ఇక ప్రముఖ, ముఖ్యంగా ప్రముఖ సినీ విమ‌ర్శ‌కుడు కమాల్ ఆర్ ఖాన్ ట్రిపుల్ ఆర్, కేజీఎఫ్ సినిమాలపై తన అక్కసు వెళ్లగక్కాడు.

దక్షిణాది సినిమాలపై ఇలా వివక్ష కొనసాగుతుండటంతోనే అప్పుడప్పుడు ఈ ప్రాంత నటులు తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. హిందీ జాతీయ భాష కాదంటూ రాజ్యాంగంలో పేర్కొన్న విషయాలను ప్రస్తావిస్తున్నారు. ఇదే బాలీవుడ్ నటులకు కంటగింపుగా మారింది. మా ప్రాంతంలో దక్షిణాది సినిమాల పెత్తనమేంటనే అసూయ పెరిగిపోతోంది. తమ గుత్తాధిపత్యానికి గండి పడుతుండటంతో పలువురు నటులు నోరు పారేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే కిచ్చా సుదీప్, అజయ్ దేవ్ గణ్ వివాదాన్ని చూడాల్సి ఉంటుంది.

హిందీ మాట్లాడేది 45 శాతమా?..

అధికారిక గణాంకాల ప్రకారమే దేశ జనాభాలో 45శాతం ప్రజలు హిందీ భాషను మాట్లాడుతున్నారు. కానీ ఈ లెక్కలపై వివాదం ఉంది.హిందీలోనూ అనేక వ్యత్యాసాలున్నాయి. రాజస్థానీ, మార్వాడీ, భోజ్ పురీ, మైథిలీ, మాగద్, మాల్వా, హిందూస్థానీ, ఖడీబోలీ యాసలు/భాషలు. ఈ యాసల్లో మాట్లాడే వారెవరు కూడా రెండో యాసను అంగీకరించరు. తమదే అసలైన భాష అని చెప్పుకుంటారు. అదంతా ఒకే భాషే కానప్పుడు దేశం మొత్తానికి అనుసంధాన భాషగా హిందీని ఎలా తీర్చిదిద్దగలరు? సాధ్యమవుతుందా? దేశంలో హిందీతో పాటు 22 జాతీయ భాషలుండగా హిందీని దేశవ్యాప్త అనుసంధాన భాషగా ఎలా మార్చుతారు? దీనికి సమాధానాలు చెప్పాల్సి ఉంది.

మన దేశానికి జాతీయ భాష లేదు..

రాజ్యాంగం ప్రకారం..మన దేశానికి జాతీయ భాష లేదు. కేంద్ర స్థాయిలో అధికార భాషగా హిందీ, ఇంగ్లిష్‌ ఉన్నాయి. రాష్ట్రాల్లో అక్కడి ప్రాంతీయ భాషలు అధికార భాషలుగా ఉంటున్నాయి. 1960 ప్రాంతంలో హిందీ భాషను ‘రుద్దడాన్ని’ తీవ్రంగా వ్యతిరేకిస్తూ దక్షిణాది రాష్ట్రాల్లో, మరీ ముఖ్యంగా తమిళనాడులో ఆందోళనలు పెల్లు బికాయి. ఈ నేప‌థ్యంలో 1963లో అధికార భాషల చట్టం వచ్చింది. అధికార లావాదేవీలన్నిటా హిందీతో పాటు ఇంగ్లిష్‌ను కూడా వినియోగించడం తప్పనిసరి చేస్తూ ఆ చట్టం తీసుకొచ్చారు. తెలుగు, కన్నడం, తమిళం, మలయాళం, ఒడియా, గుజరాతీ, పంజాబీ, బెంగాలీ వంటి 22 భాషల్ని ఆయా ప్రాంతాల్లో అధికార భాషలుగా రాజ్యాంగంలోని ఎనిమిదో షెడ్యూల్‌ గుర్తించింది.

ప్రముఖ భాషా నిపుణులు అన్నట్లుగా …‘‘ హిందీ అనే ఒక భాష ఉంది. ఇప్పుడు ఆ హిందీ సినిమా కూడా పాన్ ఇండియా సినిమాగా ఎదుగుతోంది’’ అని మ‌నం అనుకోవాలి. అప్పుడే ద‌క్షిణాది వారి ఆత్మ‌గౌర‌వం నిల‌బ‌డుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news