ఈటల ఇలాకా అయిన హుజూరాబాద్‌లో అసలేం జరుగుతోంది. టీఆర్ ఎస్ కేడర్‌ను రెండుగా చీల్చే ప్రయత్నం సాగుతుందా అంటే అవుననే సమాధానం వినిపిస్తొంది. ఈటల రాజేందర్‌పై భూ కబ్జా ఆరోపణలు వచ్చినప్పటి నుంచి హుజూరాబాద్‌లో రాజకీయాలు వేగంగా మారిపోతున్నాయి. ఆరోపణలు వచ్చిన వెంటనే నియోజకవర్గానికి వెళ్లిన ఈటల తన అనుచరులతో మంతనాలు జరిపారు.
ఏ ఒక్కరూ చేయిదాటిపోకుండా చూసుకునేందుకు వరుస చర్చలు జరిపారు. ఇదిలా ఉంటే టీఆర్ ఎస్ ఎలాగైనా ఈటలను ఒంటరి చేయాలని ప్లాన్ వేసింది. ఈ మేరకు మంత్రి గంగుల కమలాకర్‌ను రంగంలోకి దింపింది. ఆయన ఈటలకు అనుకూలంగా ఉన్న టీఆర్ ఎస్ సెకండ్ గ్రేడ్ నాయకులను టార్గెట్ చేశారు. వారందరినీ వరుసగా తన క్యాంప్ ఆఫీస్‌కు పిలిపించుకుని చర్చలు జరుపుతున్నారు.
వారందరికీ నామినేటెడ్ పోస్టులు, ఇతర కార్లు, గిఫ్ట్‌లు ఇస్తామంటూ టీఆర్ ఎస్‌వైపు తిప్పుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఫస్ట్ గ్రేడ్ నాయకులను మాత్రం టచ్ చేయట్లేదు. ఎందుకంటే వారంతా కచ్చితంగా ఈటల వెంటే ఉంటారు. వారందరినీ ఆ స్థాయికి తీసుకొచ్చింది ఈటలనే కాబట్టి వార్ ఇన్‌డైరెక్ట్‌గా అయినా ఈటలకే సపోర్టు చేస్తారని వారిని గంగుల మాట్లాడించట్లేదు. టీఆర్ ఎస్ నుంచి టికెట్లు, ఇతర పదవులు ఆశించి భంగపడ్డ వారినే టార్గెట్ చేసుకుని ఈటలకు వ్యతిరేకంగా టీమ్‌ను తయారు చేస్తున్నారు గంగుల కమలాకర్. మరి ఆయన ప్రయత్నం ఏ మేరకు ఫలిస్తుందో చూడాలి.