పెరుగుతున్న వాట్సాప్ హైజాకింగ్.. తస్మాత్ జాగ్రత్త!

-

మహారాష్ట్ర సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ వారు ఇప్పటికే నమోదైన ఎన్నో సైబర్ క్రైమ్ కేసులను పరిశీలించి వాటిలో ఎక్కువగా ఈమధ్య వాట్సాప్ అకౌంట్లు హ్యాకింగ్ కు గురవుతున్నట్లు కనుగొన్నారు. వాట్సాప్ యూజర్లకు దీని గురించి అవగాహన కల్పించేందుకు నిర్ణయించుకున్నారు. హ్యాకర్లు ఒకరి వాట్సాప్ అకౌంట్ కంట్రోల్ చేయడం మొదలు పెట్టాక వారి పర్సనల్ ఇన్ఫర్మేషన్ మొత్తం సేకరించి బ్లాక్ మెయిల్ కు పాల్పడుతున్నారని తెలిసింది.

ప్రైవేట్ సమాచారం, పర్సనల్ విషయాలు, అశ్లీల చిత్రాలను కూడా వారు సేకరించి సదరు యూజర్లను బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. ఇక అన్నిటికన్నా భయం గొలిపే విషయం ఏమిటంటే…. ఒకరి ఫోన్ లోని వాట్సాప్ హ్యాక్ అయితే చాలు. దాని నుండి…. అతని కాంటాక్ట్స్…. అందరి వాట్సప్ అకౌంట్ ను హ్యాక్ చేయడం చాలా సులువు. అది ఎలా జరుగుతుందో…. దానిని ఎలా నివారించవచ్చో కూడా మహారాష్ట్ర సైబర్ సెక్యూరిటీ అండ్ సైబర్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ వారు వెల్లడించారు

వివరాల్లోకి వెళితే…. ఎప్పుడైనా ఒక వాట్సాప్ యూజర్ తన మొబైల్ ని మార్చినప్పుడు కొత్త మొబైల్ లో వాట్సాప్ వాడేందుకు అతని నెంబర్ కి ఒక ఓటిపి వస్తుంది. అంటే వన్ టైం పాస్ వర్డ్ అన్నమాట. హ్యాకర్ కు సదరు వ్యక్తి ఫోన్ నెంబర్ తెలిసినప్పుడు… అతను కనుక ఆ otp ని తెలుసుకుంటే చాలు…. వెంటనే ఆ యూజర్ తో పాటుగా ఆ వాట్సాప్ అకౌంట్ ని హ్యాకర్ కూడా హ్యాండిల్ చేస్తాడు.

ఇప్పుడు ఉదాహరణకు రమేష్ (ఉదాహరణకి వాడుతున్న పేరు) అనే అతని వాట్సాప్ అకౌంట్ హ్యాకర్ ఆపరేట్ చేస్తున్నాడు అని అనుకుందాం. రమేష్ కి వచ్చిన ఓటిపి తెలుసుకొని అతని వాట్సాప్ అకౌంట్ లోనికి ప్రవేశిస్తాడు. అదే సమయంలో రమేష్ కూడా వాట్సాప్ వాడుకోవచ్చు కానీ హ్యాకర్ తనను గమనిస్తున్న విషయం…. తన వాట్సాప్ ను హ్యాకర్ కూడా ఆపరేట్ చేయవచ్చు అనే విషయం రమేష్ కు తెలియదు.

ఇక రమేష్ వాట్సాప్ వాడని సమయంలో అతను ఎక్కువగా ఎవరిని కాంటాక్ట్ చేస్తూ ఉంటాడో గమనిస్తాడు. ఉదాహరణకు సురేష్ (ఉదాహరణకు) అనే అతనికి రమేష్ ఎక్కువగా కాంటాక్ట్ చేస్తుంటే సురేష్ కి మెసేజ్ పెడతాడు. తన వాట్సాప్ పని చేయడం లేదని.. ఏదో ఒక కట్టు కథ చెప్పి తన ఓటిపి పంపవలసిందిగా కోరుతాడు. సురేష్ అతను చెప్పినట్లు చేసి కోడ్ ను రమేష్ అనుకొని హ్యాకర్ కు పంపితే…. హ్యాకర్…. సురేష్ అకౌంట్లోకి కూడా ప్రవేశిస్తాడు.

ఇలా రమేష్ నుండి సురేష్…. సురేష్ నుండి నరేష్ అంటూ…. అందరి అకౌంట్లలోకి హ్యాకర్ ప్రవేశించి చివరికి వారిని బ్లాల్ మెయిల్ చేయడం వరకు వెళ్తాడు. కాబట్టి మన ఫోన్ కి వచ్చే ఏ ఓటిపి అయినా కూడా ఎవరితో షేర్ చేయకపోతే ఎటువంటి ప్రమాదం ఉండదు.

Read more RELATED
Recommended to you

Latest news