సమైక్య రాష్ట్రంలో పరిటాల ఫ్యామిలీకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పరిటాల అండే ఓ బ్రాండ్.. ముఖ్యంగా కమ్మ సామాజిక వర్గంలో పరిటాలకు ఎంత క్రేజ్ ఉంటుందో తెలిసిందే. అందుకే పరిటాల రవి చనిపోయినా కూడా ఇన్ని సంవత్సరాల పాటు దేశ విదేశాల్లో ఉన్న కమ్మ వారంతా పరిటాలను ఇప్పటకీ నెత్తిన పెట్టుకుంటుంటారు. పరిటాల రవి పెనుగొండ నుంచి హ్యాట్రిక్ విజయాలు సాధించారు. ఆయన మరణాంతరం రాజకీయాల్లోకి వచ్చిన ఆయన భార్య సునీత సైతం పెనుగొండలో ఓ సారి, ఆ తర్వాత రాఫ్తాడులో మరో రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి హ్యాట్రిక్‌తో పాటు మంత్రి అయ్యారు.
ఇక మొన్ని ఎన్నికల్లో చంద్రబాబు ఆ కుటుంబానికి రెండు సీట్లు ఇచ్చేందుకు ఒప్పుకోకపోవడంతో సునీత తన సీటు త్యాగం చేసి కుమారుడు శ్రీరామ్ ను రంగంలోకి దింపింది. ఆ ఎన్నికల్లో శ్రీరామ్ ఏకంగా 27 వేల ఓట్ల తేడాతో ఘోరంగా ఓడిపోయాడు. ఇక ఎన్నికల్లో ఓడినప్పటి నుంచి శ్రీరామ్ నియోజకవర్గంలో తిరగడం మానేశాడట. శ్రీరామ్ మాత్రం 2018లో నమోదైన ఒక కేసులో ఎక్కడ అరెస్ట్ చేస్తారో అని హైదరాబాద్ బెంగళూరులో ఉంటూ అందుబాటులో లేకుండా పోయాడట.
చివరకు క్యాడర్‌కు, ముఖ్య నాయకులకు కూడా మనోడు అందుబాటులో ఉండడం లేదని అనంత రాజకీయాల్లో ఒక్కటే చర్చ నడుస్తోంది. పరిటాల ఫ్యామిలీ అంటేనే ధైర్యానికి మారుపేరు.. అలాంటిది శ్రీరామ్ కేవలం ఒక్క కేసుకే భయపడి పారిపోయాడని అంటున్నారు. పైగా ఎన్నికలకు ముందు తమ కుటుంబానికి రెండు నియోజకవర్గాలు కావాలని పరిటాల ఫ్యామిలీ పట్టుబట్టింది. ఇప్పుడు ధర్మవరం కూడా ఖాళీ అయ్యింది.
రాఫ్తాడు, ధర్మవరం రెండు నియోజకవర్గాల్లోనూ పరిటాల ఫ్యామిలీచే పార్టీని నడిపిస్తుందని చెప్పినా కూడా అసలు వీళ్లు రాఫ్తాడులోనే పత్తా లేకుండా పోయారు. దీంతో ఇప్పుడు అనంతపురం జిల్లా నుంచి పరిటాల శ్రీరామ్ పత్తా లేకుండా పోయారా ? పరారయ్యారా ? అని సెటైర్లు పేలుతున్నాయి.