whatsapp pay : వాట్సాప్ నుంచి డబ్బులు బదిలీ చేయొచ్చు ఇలా..!

-

ఈ కాలంలో డబ్బులు ఇతరులకు పంపాలంటే బ్యాంకు చుట్టూ తిరగవలిసిన పని లేదు. ఎంచక్కా స్మార్ట్ ఫోన్ మీ చేతులో ఉంటే చాలు.. ఒకే ఒక క్లిక్ తో నిమిషాల్లో డబ్బులు మీకు కావలిసిన వాళ్ళకి ట్రాన్సఫర్ అవుతాయి. ఇప్పుడు చాలామంది ఇలానే డబ్బులు పంపుతున్నారు. ఇప్పుడు ఎక్కువగా మార్కెట్లో గూగుల్ పే, ఫోన్ పే, పేటిఎమ్ లాంటి యూపీఐ యాప్స్ వాడుతున్నారు. అయితే ఇప్పుడు మార్కెట్లోకి మరొక కొత్త పేమెంట్ ఆప్షన్ కూడా వచ్చేసింది. అదేంటో… ఎలా డబ్బులు వేరేవాళ్లకి పంపాలో తెలుసుకోండి..

సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్‌కు చెందిన ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ తాజాగా తన కస్టమర్లకు పేమెంట్ సర్వీసులను అందుబాటులోకి తీసుకువచ్చింది. అయితే ఈ యాప్ ద్వారా డబ్బులు ఎలా పంపాలో తెలుసుకుందాం.. ముందుగా వాట్సాప్ వాడే వారు రిజిస్టర్ చేసుకోవాలి. రిజిస్టర్ అయ్యాక బ్యాంక్ అకౌంట్‌తో లింక్ అయి ఉన్న మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ తప్పకుండా మీ స్మార్ట్‌ఫోన్‌‌లో ఉండాలి. అప్పుడే మీరు రిజిస్టర్ ప్రక్రియను పూర్తి చేయవచ్చు.

– మీరు మీ ఫోన్ లోని వాట్సాప్ ‌లోకి వెళ్లాలి.
– మీకు వాట్సాప్ పైభాగంలో కుడి వైపున మూడు చుక్కలు కనిపిస్తాయి కదా వాటిపై క్లిక్ చేయాలి.
– మీకు అందులో ఆరు ఆప్షన్లు కనిపిస్తాయి. వీటిల్లో పేమెంట్స్ అనే ఆప్షన్ ఉంటుంది దాన్ని ఎంచుకోవాలి.
– యాడ్ పేమెంట్ మెథ‌డ్ అనే ఆప్ష‌న్‌పై క్లిక్ చేసి మీ నెంబర్ తో లింక్ అయిన బ్యాంక్ ను ఎంచుకోవాలి.
– ఇప్పుడు మీ ఫోన్‌ నెంబర్ కి ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత యూపీఐ ఐడీ క్రియేట్ అవుతుంది.
– మీరు ఎవ‌రికైనా డ‌బ్బులు పంపించాల‌నుకుంటే.. వాట్సాప్ పేమెంట్స్‌లోకి వెళ్లి న్యూ పేమెంట్ బ‌ట‌న్‌పై క్లిక్ చేసి, ఎవ‌రికైతే పంపించాల‌నుకుంటున్నారో వారి ఫోన్ నెంబ‌ర్ సెలెక్ట్ చేసుకొని పంపించ‌వచ్చు. అయితే ఇక్కడ మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోండి.. మీరు ఎవరికయితే డబ్బులు పంపాలి అని అనుకుంటున్నారో వారు కూడా తప్పకుండా వాట్సాప్ పేమెంట్‌ సర్వీసులను యాక్టివేట్ చేసుకోని ఉండాలి. అలా అయితేనే డబ్బులు పంపించడం సాధ్యమౌతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం.. వెంటనే రిజిస్టర్ చేసుకుని సేవలను ఆనందించండి.

– ఇంకా యూపీఐ నెంబ‌ర్‌తో కూడా డ‌బ్బులు ట్రాన్స్‌ఫ‌ర్ చెయ్య‌వ‌చ్చు. అంతే కాకుండా క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి కూడా డ‌బ్బులు పంపించ‌వ‌చ్చు.

– మీరు వేరే ఎవరికన్నా డబ్బులు పంపాలనుకుంటే ఆ బ్యాంకుకు సంబంధించిన డెబిట్ కార్డు మీ వద్ద ఉండాలి. కార్డు చివరి ఆరు నెంబర్లు, ఎక్స్‌పైరీ డేట్ వంటి వివరాలు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు కూడా ఓటీపీ వస్తుంది. తరువాత మీరు యూపీఐ పిన్ సెట్ చేసుకోవాలి. ఇలా చేస్తే మీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ విజయవంతం అయిపోయింది.

Read more RELATED
Recommended to you

Latest news