మనదేశంలో ఆచార సాంప్రదాయాలు ఎక్కువ..అలాగే దేవతలను భక్తితో పూజించడం కూడా ఎక్కువే..భక్తితో పాటు భగవంతుని లీలలు, అద్భుతాలు నేటికీ ఈ ఆలయాల్లో కనిపిస్తాయి.మథురలోని బృందావంధామలోని ఏడు దేవాలయాలలో ఒకటైన రాధారామన్ ఆలయం కూడా ఒకటి. ఇటువంటి అద్భుతాలకు సంబంధించి ఈ ఆలయం ఎప్పుడూ చర్చల్లో నిలుస్తూనే ఉంటుంది. ఐదు శతాబ్దాలుగా అక్కడ భగవంతుని అద్భుతం, అద్వితీయమైన లీల కొనసాగుతోంది. ఇక్కడి ఆయల ఆవరణలో భగవంతుడి ప్రసాదాలు తయారు చేసేందుకు గత 480 సంవత్సరాలుగా కొలిమి నిరంతరం మండుతూనే ఉంది. ఈ అగ్ని నుండి వెలువడే జ్వాల ఈ ఆలయంలో దీపం, హారతి నుండి దేవుడికి నైవేద్యాల వరకు ఉపయోగించబడుతుంది.ఆ కొలిమి గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
ఈ ఆలయంలో మండుతున్న కొలిమికి చాలా చరిత్ర ఉందని పండితులు చెబుతున్నారు..దేవుని కార్యాలన్నీ పూర్తయిన తర్వాత రాత్రిపూట కొంత కలపను ఉంచి, అగ్ని చల్లబడకుండా పై నుండి బూడిదను కప్పిఉంచుతారు. మరుసటి రోజు ఉదయం, అదే మంటలో కొంత ఆవు పేడ పీడకలు, ఇతర కట్టెలు వేసి మిగిలిన బట్టీలను వెలిగిస్తారు. ఈ ఆచారం ఈ కొలిమి అన్ని పాత పూరాతన కాలంనాటివే. ఇది గత 480 సంవత్సరాలుగా నిరంతర జ్వాలగా మండుతూనే ఉందని చెబుతారు..
ఈ పవిత్రమైన అఖండ జ్యోతి నుండి పొందిన అగ్నిని జ్వాలతో దీపాలు, జ్వాల వెలిగించడంతో పాటు దేవుడికిచ్చే హారతిలోనూ ఉపయోగిస్తారు. ఇక్కడ ఎలాంటి జ్యోతి ప్రజ్వలన చేసినా లైటర్ గానీ, అగ్గిపెట్టె గానీ వాడరు. బదులుగా ఈ కొలిమి మంట నుండి వచ్చే అగ్నిని మాత్రమే వాడుకుని భగవంతుని నైవేద్యాలు చేయడానికి ఉపయోగిస్తారు..వంటగదిలోకి బయటి వ్యక్తుల ప్రవేశం నిషేధించబడింది. ఈ ఆలయ సేవకుడికి ధోతి తప్ప వేరే బట్టలు ఉండవు. వంట గదిలోకి వెళ్లిన తర్వాత, ప్రసాదం మొత్తం చేసిన తర్వాతే బయటకు వస్తారు. మధ్యలో ఒకసారి అతను బయటకు రావలసి వస్తే ఆలయంలోని పవిత్రమైన వంటగదిలోకి ప్రవేశించడానికి అతను తిరిగి స్నానం చేయాల్సి ఉంటుంది.. లేనిచో ప్రవేశం లేదు..ఈ జ్యోతిని దర్శించుకునేందుకు ఏటా చాలా మంది భక్తులు వస్తుంటారు.