మంగళవారం ఢిల్లీలో సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలతో ఏపీ రాజధాని అంశం మరోసారి చర్చనీయాంశంగా మారింది. సీఎం చేసిన వ్యాఖ్యలపై ప్రతిపక్షాలు మండిపడ్డాయి. వీటిపై ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం స్పందించారు. ముఖ్యమంత్రి ఎక్కడ నుంచి పరిపాలన చేస్తే ఆ ప్రాంతమే రాజధాని అవుతుందని స్పష్టం చేశారు తమ్మినేని సీతారాం.
సాగర నగరం అన్ని రకాలుగా కనెక్టివిటీ హబ్ గా ఉంటుందని పేర్కొన్నారు. అటు పారిశ్రామికవేత్తలు కూడా విశాఖపట్నం ఆసక్తి చూపిస్తున్నారని వెల్లడించారు. సీఎం జగన్ నిర్ణయం అద్భుతంగా ఉందని, ప్రజలు స్వాగతిస్తున్నారని వివరించారు. తాను కూడా విశాఖపట్నం వచ్చేస్తున్నానని స్వయంగా జగనే చెప్పారని, విశాఖ ఇండస్ట్రియల్ కారిడారుగా రూపుదిద్దుకోనిందని తెలిపారు. మరోవైపు విశాఖ రాజధాని అంశంపై విచారణను సుప్రీంకోర్టు ఈనెల 7కు వాయిదా వేసింది.