కరోనా వైరస్ తీవ్రత చూసింది కొంచమే…!

-

ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ తీవ్రత క్రమంగా పెరుగుతుంది. ఆ వైరస్ పుట్టిన చైనాలో అయితే రోజు రోజుకి వ్యాధి తీవ్రత క్రమంగా పెరిగిపోతుంది. ఇప్పటి వరకు 40 వేల మందికి పైగా ఈ వ్యాధి సోకింది. మరో 30 వేల మందికి పైగా కరోనా లక్షణాలు ఉన్నట్టు వైద్యులు గుర్తించారు. ఇక మృతుల సంఖ్య వెయ్యికి దాటేసింది. దీనితో చైనా ప్రభుత్వం ఈ వ్యాధిని ఏ విధంగా అదుపు చెయ్యాలో అర్ధం కాక తల పట్టుకుంటుంది.

అయితే దీనిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇప్పటి వరకు చైనాలో పుట్టిన కరోనా వైరస్ తీవ్రతను ప్రపంచం కొంచమే చూసింది అని అది మరింత తీవ్రమయ్యే అవకాశం ఉందని అంటున్నారు. లక్ష మంది వరకు రోగులు మరణించే అవకాశం ఉందని అంటున్నారు. ఇక దాదాపు మూడు లక్షల మందికి నెల రోజుల్లో ఈ వ్యాధి సోకే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

ఇక క్రమంగా భారత్ సహా మరో 20 దేశాల్లో ఈ వ్యాధి మరింత వేగంగా సోకే అవకాశం ఉందని అంటున్నారు. ఇప్పటికే భారత్ లో కేవలం ముగ్గురికి మాత్రమే ఈ వ్యాధి సోకిందని సమాచారం. అయితే ఇప్పటి వరకు ఎవరూ మరణించలేదు. ఇప్పటికే అన్ని అంతర్జాతీయ విమానాశ్రయాల్లో కరోనా దెబ్బకు అధికారులు అన్ని జాగ్రత్తలు పక్కాగా తీసుకుంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news