కరోనాపై WHO కీలక వ్యాఖ్యలు… దశాబ్దాల పాటు ఉంటుంది అంటూ…

-

రెండేళ్ల క్రితం చైనా వూహాన్ నగరంలో పుట్టిన కరోనా వైరస్ ప్రపంచాన్ని ముప్పుతిప్పలు పెడుతోంది. అన్ని దేశాలకు వ్యాపించి ప్రపంచాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. రకరకాల కొత్త వేరియంట్ల రూపంలో ప్రజలపై దాడి చేస్తూనే ఉంది. ఆల్పా, డెల్టా, ఓమిక్రాన్ ఇలా వరసగా కొత్త వేరియంట్లు పుట్టుకొస్తూనే ఉన్నాయి. ప్రస్తుతం ఓమిక్రాన్ ప్రపంచ దేశాలను కలవరపరుస్తోంది. ఓ వైపు వ్యాక్సినేషన్ కార్యక్రమాలు జరుగుతున్నా.. ప్రజలు రీ ఇన్ఫెక్షన్ల బారిన పడుతున్నారు.

ఇదిలా ఉంటే కరోనాపై ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO కీలక వ్యాఖ్యలు చేసింది. ఆ సంస్థ ఛీఫ్ డా్. టెడ్రోస్ అథనోమ్ కరోనా గురించి సంచలన విషయాలు వెల్లడించారు. కరోనా మహమ్మారి ప్రభావం దశాబ్ధాల పాటు ఉంటుందని, వైరస్ సోకే ముప్పు కూడా అదే స్థాయిలో ఉంటుందని హెచ్చరించారు. ఇక వ్యాక్సినేషన్ విషయంలో కూడా తీవ్ర  అంతరాలు ఉంటున్నాయని.. అలా కాకుండా ప్రపంచంలో అందరికి వ్యాక్సిన్లు అందించేందుకు WHO ప్రయత్నిస్తుందని అన్నారు. కామన్వెల్త్ దేశాల్లో సగటు వ్యాక్సినేషన్ రేటు 42 శాతంగా ఉంటే.. ఆఫ్రికా దేశాల్లో ఇది కేవలం 23 శాతమే అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news