బీజేపీ ఇవ్వకపోతే ఇవన్నీ ఎవరు ఇచ్చారు?: ప్రధాని మోడీ

-

కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎంపై విరుచుకుపడిన ప్రధాని నరేంద్ర మోడీ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో జరుగుతున్న బీజేపీ ఎన్నికల ప్రచార సభలో ప్రధాని మోదీ పాల్గొన్నారు.ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ… తెలంగాణకు కేంద్రం ఇస్తున్న నిధులను కాంగ్రెస్ నేతలు ఏటీఎంగా మార్చుకున్నారని ప్రధాని మోదీ ఆరోపించారు. ‘4 వందే భారత్ రైళ్లు తెలంగాణకు ఎవరు ఇచ్చారు? తొలి ఎయిమ్స్, ఫర్టిలైజర్స్ పరిశ్రమ, పసుపు బోర్డు, గిరిజన యూనివర్సిటీ ఎవరు ఇచ్చారు? తెలంగాణకు ఏమీ ఇవ్వలేదని కాంగ్రెస్ అంటోంది. సబ్ కా సాత్.. సబ్ కా వికాస్ బీజేపీ నినాదం’ అని మోదీ తెలిపారు.

బీజేపీని గెలిపించేందుకు 140 కోట్ల మంది ప్రజలు సంకల్పం తీసుకున్నారని అన్నారు.జూన్ 4 తరువాత దేశంలో ఉన్న ఓట్ జిహాద్ వాళ్లు పారిపోతారంటూ కాంగ్రెస్‌ను ఉద్దేశించి ప్రధాని మోడీ సెటైర్లు వేశారు. అదేవిధంగా జూన్ 4 తరువాత భారత విరోధులు, పౌర స్మృతి విరోధులు, ఆర్టికల్ 370 విరోధులు పారిపోతారంటూ కాంగ్రెస్‌పై సెటైర్లు వేశారు ప్రధాని నరేంద్ర మోడీ.

Read more RELATED
Recommended to you

Latest news