ఏపీ కేబినెట్‌లో రెండున్నరేళ్ల తర్వాత జరుగుతుందని భావించిన మంత్రి వర్గ విస్తరణ.. లేదా పునర్విభజ న.. కేవలం ఏడాది తిరిగే సరికే చేపట్టాల్సిన నిర్బంధ పరిస్తితి ఏర్పడింది. రాజధాని వికేంద్రీకరణ, సీఆర్ డీఏ బిల్లుల రద్దు కోరుతూ.. అసెంబ్లీ ఆమోదించిన బిల్లులను మండలి అడ్డుకోవడంతో మొదలైన రాజకీ య క్రీడ.. అనూహ్య పరిణామాల దిశగా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలోనే అసలు మండలే వద్దు.. అని జగన్ సర్కారు అసెంబ్లీలోనే తీర్మానం చేసి.. కేంద్రానికి పంపించింది. దీంతో రేపోమాపో.. మండలి రద్దయ్యే అవకాశం కనిపిస్తోంది. దీంతో మండలి నుంచి మంత్రివర్గంలో ప్రాతినిధ్యం వహిస్తున్నవారితో రాజీ నామా చేయించారు జగన్.
బీసీ వర్గానికి చెందిన మోపిదేవి, బోసులు తమ మంత్రి వర్గ స్థానాలకు రాజీనామా చేసి.. ప్రమోషన్‌పై రా జ్యసభకు వెళ్లారు. దీంతో ఈ రెండు మంత్రి వర్గ స్థానాలను భర్తీ చేసేందుకు జగన్ ఈ నెల 22న ముహూ ర్తం కూడా నిర్ణయించారని అంటున్నారు. ఈ క్రమంలో మంత్రి వర్గంలో ఆశావహుల సంఖ్య పెరుగుతోంది. కొందరు ఏకంగా తెరచాటున తమనే ఈ సీటు వరిస్తుందని ప్రచారం కూడా చేస్తున్నారు. వీరిలో చిలక లూరి పేట నియోజకవర్గానికి చెందిన విడదల రజనీ ముందు స్థానంలో ఉన్నారు. తాను బీసీ వర్గానికి చెందిన మహిళనని, పార్టీ విషయంలో దూకుడుగా ఉన్నానని, టీడీపీ నేతలు చెమటలు పట్టిస్తున్నానని.. సో.. తనకు ఖచ్చితంగా మంత్రి వర్గంలో చోటు దక్కుతుందని అంటున్నారు.
ఇదే సమయంలో మరో ప్రచారం కూడా ఉంది. రెండు బీసీ స్థానాలు ఖాళీ అయినంత మాత్రాన.. రెండు కూడా వారికే ఇవ్వాల్సిన అవసరం లేదని, చాలా మంది ఆశావహులు ఉన్నారని, కాబట్టి.. ఒకటి బీసీ నేతకు, రెండోది.. మరో సామాజిక వర్గానికి కేటాయిస్తారని పార్టీలో అంతర్గత చర్చ సాగుతోంది. అయితే, ఇప్పటి వరకు జగన్ ఆలోచన ఎలా ఉందనే విషయంపై క్లారిటీ లేక పోవడం గమనార్హం. అయితే, ముహూర్తం మాత్రం మరో పదిహేను రోజుల్లో ఉండడంతో నేతల మధ్య మాత్రం ఉత్కంఠ పెరిగిపోతోంది. మాకంటే మాకేనని నాయకులు తమలో తాము చర్చించుకోవడం గమనార్హం. అంతిమంగా జగన్ ఎవరిని తన కేబినెట్ లో చేర్చుకుంటారో చూడాలి.