రోజా-రజిని-పద్మావతిల్లో ఛాన్స్ ఎవరికి?

-

ఎట్టకేలకు మంత్రి పదవులు కోసం ఆశగా ఎదురుచూస్తున్న వైసీపీ ఎమ్మెల్యేలకు జగన్ గుడ్ న్యూస్ చెప్పారు..గత ఆరు నెలలుగా మంత్రివర్గంలో మార్పులు జరుగుతాయని, తమకు మంత్రివర్గంలో ఛాన్స్ దొరుకుతుందని చూస్తున్న ఆశావాహులకు జగన్ కొత్త ఉత్సాహాన్ని ఇచ్చారు..రాబోయే జూన్ లో మంత్రివర్గంలో మార్పులు చేస్తానని జగన్ క్లారిటీ ఇచ్చేశారు..అయితే ఈ నెల 15న జరిగే వైఎస్సార్సీపీ సమావేశం తర్వాత దీనిపై పూర్తి క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది.

మొత్తానికైతే మంత్రివర్గంలో మార్పులు జరగడం ఖాయమని తెలుస్తోంది..దీంతో పదవులు ఆశిస్తున్న ఎమ్మెల్యేలు…పదవులు దక్కించుకోవడానికి రెడీ అయిపోయారు..ఇదే క్రమంలో పదవులు ఆశిస్తున్న మహిళా ఎమ్మెల్యేలు సైతం..మహిళా కోటాలో ఛాన్స్ దక్కించుకోవడానికి చూస్తున్నారు. ప్రస్తుతం క్యాబినెట్ లో ముగ్గురు మహిళా మంత్రులు ఉన్నారు..పుష్పశ్రీ వాణి, మేకతోటి సుచరిత, తానేటి వనిత..ఈ ముగ్గురు క్యాబినెట్ లో ఉన్నారు.

అయితే ఈ ముగ్గురుని మంత్రివర్గం నుంచి తప్పించడం గ్యారెంటీ అని తెలుస్తోంది..అంటే త్వరలోనే జరగబోయే మంత్రివర్గం మార్పులో ఈ ముగ్గురు మహిళా మంత్రులు సైడ్ అవ్వడం ఖాయం..ఇక వీరి ప్లేస్ లో ఛాన్స్ కొట్టేయడానికి పలువురు మహిళా ఎమ్మెల్యేలు ప్రయత్నిస్తున్నారు..ఎవరికి వారు తమ వంతు ప్రయత్నాలు చేయడం…వైసీపీ పెద్దల ద్వారా లాబీయింగ్ చేసి పదవులు దక్కించుకోవడం కోసం సిద్ధమవుతున్నారని తెలుస్తోంది. ఈ క్రమంలోనే నగరి ఎమ్మెల్యే రోజా ఎప్పటినుంచో పదవి ఆశిస్తున్నారు..ఈ సారి ఖచ్చితంగా పదవి దక్కించుకోవాలని అనుకుంటున్నారు. జగన్ సైతం రోజాకు పదవి ఇవ్వడానికి సుముఖంగానే ఉన్నట్లు తెలుస్తోంది.

అటు తొలిసారి ఎమ్మెల్యేలు అయిన చిలకలూరిపేట ఎమ్మెల్యే విడదల రజిని, శింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి సైతం పదవి ఆశించే లిస్ట్ లో ఉన్నారని తెలుస్తోంది. బీసీ కోటాలో రజిని, ఎస్సీ కోటాలో పద్మావతి పదవి దక్కించుకోవాలని చూస్తున్నట్లు తెలుస్తోంది…వీరే కాదు ఇంకా పలువురు మహిళా ఎమ్మెల్యేలు పదవులపై ఆశలు పెట్టుకున్నారు…మరి వీరిలో మంత్రిగా ఛాన్స్ ఎవరికి దక్కుతుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news