కృష్ణా జిల్లా అంటే ఒకప్పుడు తెలుగుదేశం పార్టీ అడ్డా..అయితే ఇప్పుడు కాదు..ఒకప్పుడు మాత్రమే..ఇప్పుడు కృష్ణా జిల్లాలో ఫ్యాన్ హవా ఉంది..గత ఎన్నికల నుంచి జిల్లాలో ఫ్యాన్ ఆగకుండా తిరుగుతుంది. ఇలా ఫ్యాన్ ఆగకుండా తిరుగుతుండటంతో.. సైకిల్ సవారీ కుదరడం లేదు..అందుకే ఫ్యాన్‌ని ఆపేయాలని తెలుగు తమ్ముళ్ళు ప్రయత్నిస్తున్నారు.. అయితే కొంతవరకు తమ్ముళ్ళ ప్రయత్నాలు ఫలిస్తున్నాయనే చెప్పొచ్చు.. అదే సమయంలో కొన్ని చోట్ల ఫ్యాన్ స్పీడ్‌కు సైకిల్ అడ్రెస్ గల్లంతయ్యే పరిస్తితి వచ్చింది. అలా గుడివాడ, గన్నవరం నియోజకవర్గాల్లో ఫ్యాన్ స్పీడుకు సైకిల్ అడ్రెస్ గల్లంతయిందనే చెప్పాలి.
అసలు గత రెండు ఎన్నికల నుంచి గుడివాడలో టీడీపీ పరిస్తితి మరీ దారుణంగానే ఉంది..అసలు కొడాలి నాని దెబ్బకు సైకిల్ మళ్ళీ పైకి లేవని పరిస్తితి ఉంది..ఇక్కడ కేవలం కొడాలి వన్ మ్యాన్ షో మాత్రమే నడుస్తోంది..ఇప్పటికీ అదే పరిస్తితి ఉంది..దీని బట్టి చూస్తే వచ్చే ఎన్నికల్లో కూడా గుడివాడలో కొడాలి గెలుపుని టీడీపీ ఆపేలా కనిపించడం లేదు. అయితే పేరుకు గుడివాడ టీడీపీ ఇంచార్జ్‌గా రావి వెంకటేశ్వరరావు అన్నారు..పాపం ఈయన పేరుకే ఇంచార్జ్ తప్ప పనిచేయడానికి కాదు.
మరి కొడాలి మంత్రిగా ఉన్నారనే భయమో..లేక ఏది చేస్తే ఏ కేసు పెడతారని భయమో..లేక ఇప్పుడు ప్రతిపక్షంలో ఉంటూ డబ్బులు ఖర్చు పెట్టాలనే భయమో తెలియదు గాని..మొత్తానికి రావి సైలెంట్‌గా ఉంటున్నారు..దీని వల్ల రావికి నష్టం లేదు..కానీ గుడివాడలో టీడీపీకే నష్టం. కాబట్టి గుడివాడలో రావి బదులు బలమైన నాయకుడుని కొడాలికి ప్రత్యర్ధిగా పెట్టాలి..అప్పుడే కొడాలిని ఆపగలరు.
అటు గన్నవరంలో మొన్నటివరకు వల్లభనేని వంశీ..టీడీపీలో ఉన్నారు కాబట్టి..టీడీపీ బలంగానే కనిపించింది..కానీ ఆయన వైసీపీ వైపుకు వెళ్ళాక టీడీపీ వీక్ అయింది. ఏదో ఇక్కడ టీడీపీ ఇంచార్జ్‌గా బచ్చుల అర్జునుడుని పెట్టారు..ఇక ఈయన వల్ల కూడా టీడీపీకి పావలా ఉపయోగం లేదు..కాబట్టి ఈయన ప్లేస్‌లో బలమైన కమ్మ నేతని పెట్టాలని తమ్ముళ్ళు డిమాండ్ చేస్తున్నారు..అప్పుడే వంశీకి చెక్ పెట్టగలమని అంటున్నారు. మొత్తానికి కొడాలి, వంశీలని ఆపే సత్తా ఎవరికి ఉందో చూడాలి.