విమానాలన్నీ తెలుపు రంగులోనే ఎందుకుంటాయి..? ఆ ఒక్క దేశంలోనే నల్లగా ఎందుకు..?

-

విమానాలన్నీ దాదాపుగా తెలుపు రంగులోనే ఉంటాయి. వాటి తోక భాగాలకు ఎయిర్ లైన్స్ కంపెనీల తాలూకు వివిధ రంగులు కనిపిస్తుంటాయి తప్ప మిగతా భాగం మొత్తం తెలుపు రంగులోనే ఉంటుంది.

అసలు ఇలా తెలుపు రంగులో ఉండడానికి కారణం ఏంటనేది ఇప్పుడు తెలుసుకుందాం.

అలాగే తెలుపు రంగుకి ఎగ్జాక్ట్ ఆపోజిట్ అయిన నలుపు రంగు కలిగిన విమానాలు కూడా ఉన్నాయి. నలుపు రంగుతో ఆకాశంలో విమానాలను ఎగరేసే దేశం ఏంటో.. వాళ్లు అందరికీ భిన్నంగా ఎందుకు చేస్తున్నారో ఇక్కడ తెలుసుకుందాం.

వేడి ఎక్కువగా ఉన్న రోజుల్లో ముఖ్యంగా ఎండాకాలంలో విమానం లోపల వేడి తక్కువగా ఉండటానికి విమానాలకు తెలుపు రంగు వేస్తారు. తెలుపు రంగు వేడిని లాగేసుకుంటుంది కాబట్టి.. విమానం లోపల ఎక్కువ వేడి ఉండదు. అంతేకాదు తెలుపు రంగు బరువు తక్కువగా ఉంటుంది. దానివల్ల గాలిలో ఎగిరే విమానానికి ఇంధనం ఖర్చు ఎక్కువగా అవ్వదు.

విమానం పైన పగుళ్లను ఈజీగా గుర్తించడానికి తెలుపు రంగును వాడతారు. తెలుపు కాకుండా వేరే డార్క్ కలర్ వేస్తే.. పగుళ్లు తొందరగా కనిపించవు.

నీలిరంగు ఆకాశంలో తెల్లని విమానం పక్షులకు క్లియర్ గా కనిపిస్తుంది. దీనివల్ల అవి విమానం నుండి దూరంగా పోయే అవకాశం ఉంటుంది.

మరి న్యూజిలాండ్ మాత్రం నలుపు రంగు ఎందుకు వేస్తుంది..?

దాదాపు అన్ని దేశాల ఎయిర్ లైన్స్ తమ విమానాలకు తెలుపు రంగును వేస్తుంటాయి. కానీ.. న్యూజిలాండ్ ఒక్కటే.. తమ ఎయిర్ లైన్స్ అయినా ఎయిర్ న్యూజిలాండ్ విమానాలకు నలుపు రంగును వేస్తుంది. న్యూజిలాండ్ జాతీయ పక్షి అయిన కివి.. నలుపు రంగులో ఉంటుంది కాబట్టి.. వాటి విమానాలు జాతీయత ఉట్టిపడేలా ఉండాలని.. నలుపు రంగును వేస్తారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version