ఏ ఫోన్‌కు అయినా కెమెరాలు ఎందుకు ఎడమవైపు ఉంటాయి..?

-

ఫోన్‌లో మెమరీ ఎంత ముఖ్యమో కెమెరా కూడా అంతే ముఖ్యం. ఇది హై క్వాలిటీ అయితేనే ఫోటోలు, వీడియోలు బాగా వస్తాయి. ఎలాంటి ఫోన్‌ అయినా కెమెరాలు మూడు నాలుగు ఉంటాయోమో కానీ.. కమెరా ఎడమవైపు మాత్రమే ఉంటుంది. కెమెరా ఎడమవైపు ఉండడానికి కారణం ఏంటి..? మొబైల్ డిజైన్ అని చాలా మంది అనుకుంటారు. అయితే ఇది ప్రధాన కారణం కాదు కానీ మరో కారణం కూడా ఉంది. దాని గురించి మరింత తెలుసుకుందాం.

స్మార్ట్‌ఫోన్‌ల యుగంలో ఫోన్‌లు కొత్త కొత్త అప్‌డేట్స్‌తో వస్తున్నాయి. ఇంతకుముందు కమ్యూనికేషన్ కోసం మాత్రమే ఉపయోగించే మొబైల్ ఫోన్ ఇప్పుడు ప్రజల జీవితంలో ముఖ్యమైన భాగంగా మారింది. చాలా పనులను మొబైల్ ద్వారా చక్కబెడుతున్నారు. దీనితో పాటు మొబైల్ విసృత వినోద సాధనంగా మారింది. అయితే అప్‌డెట్స్‌తో వస్తున్న ఫోన్‌లో చాలా మార్పులు చూస్తుంటాం. కానీ చాలా స్మార్ట్‌ఫోన్‌‌లలో‌ కెమెరా స్థానంలో మాత్రం ఎలాంటి మార్పు లేకుండా ఎడమ వైపున ఉంటుంది. చాలా మొబైల్ ఫోన్‌లలో ఎడమవైపు మాత్రమే కెమెరా ఉంటుంది.

ఎడమవైపు కెమెరా ఉండానికి కారణం

చాలా మంది ప్రజలు ఎడమ చేతితో మొబైల్‌ను ఉపయోగిస్తుంటారు. అటువంటి పరిస్థితిలో, ఎడమ వైపు కెమెరా ఉండడం వల్ల ఫోటోలు లేదా వీడియోలను షూట్ చేయడం సులభం అవుతుంది. అలాగే, కెమెరాను ల్యాండ్‌స్కేప్‌గా ఉపయోగించినప్పుడు. మొబైల్ కెమెరా పైకి ఎదురుగా ఉంటుంది, దీంతో మనం సులభంగా ల్యాండ్‌స్కేప్ ఫోటోలను తీయవచ్చు. దీని కోసమే, కెమెరాను మొబైల్ ఫోన్‌లో ఎడమ వైపున అమర్చారు.

సెల్ఫీ కెమెరా మిర్రర్ ప్రభావం

అలాగే మొబైల్ వినియోగదారులు ఫ్రంట్ కెమెరాతో సెల్ఫీ తీసుకుంటే ఫోటో రివర్స్ అవుతుంది. అంటే, దాని స్థానం ఎడమ నుండి కుడికి లేదా కుడి నుండి ఎడమకు మారుతుంది. అందుకే సెల్ఫీలో రాసుకున్న పేరు తిరగబడుతుంది. చాలా మొబైల్స్‌లో ఈ సమస్య ఉంటుంది. మొబైల్స్‌లోని సెల్ఫీ కెమెరా మిర్రర్ ఎఫెక్ట్‌ని కలిగి ఉంటుంది. ఎవరైనా సెల్ఫీ తీసుకుంటే కెమెరాలో సూటిగా కనిపించినా, ఫోటో తీసిన తర్వాత తలకిందులుగా కనిపించడానికి కారణం ఇదే

ఇంతకుముందు కెమెరా మధ్యలో ఉండేది..

మొదట్లో స్మార్ట్‌ఫోన్ మధ్యలో కెమెరాలను ఉంచారు, కానీ క్రమంగా ఈ కెమెరాలు మొబైల్‌కు ఎడమ వైపుకు రావడం మొదలయ్యాయి. ఇది మొదట ఐఫోన్‌తో స్టాట్‌ చేశారు. అలా తర్వాత చాలా కంపెనీలు ఎడమ సైడ్ కెమెరాలను అందించడం ప్రారంభించాయి.

Read more RELATED
Recommended to you

Latest news