ఢిల్లీలో భూకంపం.. సర్వత్రా టెన్షన్

-

ఢిల్లీ పరిసర ప్రాంతాలలో నిన్న మధ్యరాత్రి భూ ప్రకంపనలు టెన్షన్ పెట్టాయి. నిన్న రాత్రి 11.46 నిముషాలకు కొన్ని సెకండ్ల పాటు తీవ్ర భూప్రకంపనలు వచ్చాయి. రిక్టర్ స్కేలు పై 4.2 గా నమోదు అయింది. హర్యానా లోని గుర్గావ్ కు నైరుతిదిశగా 48 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్టు గుర్తించారు. అయితే, ఇందులో ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం లేదు. కొండలు, గుట్టలు ఎత్తైన ప్రాంతాలకు ఢిల్లీ చాలా దగ్గరగా ఉండడం వల్ల భారీ భూకంపాలు వచ్చే ప్రమాదం ఉందని భూవిజ్ఞాన శాస్త్రవేత్తల అంచనా వేస్తున్నారు.

ఇక ప్రస్తుతం అత్యంత ప్రమాదకర “సెస్మిక్ జోన్—4”  పరిధిలో ఢిల్లీ ఉంది. భూకంపాలు తరచూ వచ్చే అవకాశాలు,  తీవ్రతలను దృష్టిలో పెట్టుకుని భారత్ దేశాన్ని 4 జోన్లు గా విభజించారు. ఏప్రిల్ 12వ తేదీ నుంచి ఇప్పటివరకు ఢిల్లీ లో మొత్తం 20 సార్లు వచ్చిన భూప్రకంపనలు వచ్చాయి. భూమి ఉపరితలం నుంచి 7.5 కిలోమీటర్ల లోతులో ప్రకంపనలు  ఏర్పడ్డాయి.  రిక్టర్ స్కేలుపై 6 గా నమోదయ్యే భూకంపంవస్తే ఢిల్లీలో ఎలాంటి మార్గదర్శకాలు పాటించకుండా కట్టిన భవనాలన్నీ తీవ్రంగా దెబ్బతింటాయని భూవిజ్ఞాన శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news