నవ గ్రహ పూజను ఎందుకు చేస్తారు?తర్వాత ఇలాంటివి చేస్తే మహాపాపమట..

-

మన జాతకంలో ఏదైనా దోషం ఉంటే నవ గ్రహ పూజను చేయిస్తారు.నవగ్రహ పూజా ఫలితం దక్కాలంటే పూజ విధివిధానాలను పక్కాగా పాటించాలి.అసలు పూజ చేసిన తర్వాత వెంటనే ఏం చేయాలి, ఏం చెయ్యకూడదు అనే విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం…

నవగ్రహాల పూజ తర్వాత కాళ్లు కడుక్కోవాలనేది ఏ శాస్త్రంలోను లేదట…అలాగే ఏ ధర్మంలోనూ చెప్పలేదట. నవగ్రహాల పూజ చేసి..అక్కడే కాళ్ల కడుక్కుంటే దోషాలన్నీ పోతాయని చాలామంది అంటుంటారు.. అయితే గుడి వెళ్ళే ముందు స్నానం చేసి వెళతారు.వెళ్ళి వచ్చాక మాత్రం కాళ్ళు కడుక్కోరు.

ఒకవేళ నవగ్రహాల గుడికి వెళ్లాలనుకున్నప్పుడు..ముందు నవగ్రహాల పూజ చేయాలి. ఆ తర్వాత ప్రధాన గుడిని దర్శించుకోవాలి. లేదంటే ముందు ప్రధాన గుడిని దర్శించుకున్న తర్వాత నవగ్రహాల పూజ చేసుకుని ఇంటికి రావాలి. అంతేకానీ కాళ్లు కడుక్కోవడం అనేది ఎక్కడా ప్రస్తావించలేదు..

గుడి ఇంటికి దూరంగా ఉన్నట్లయితే కాళ్లకు దుమ్మూధూళి అంటుకుంటే.అప్పుడు గుళ్లోకి వెళ్లే ముందు కాళ్లు కడుక్కోవాలి. నవగ్రహ పూజ కూడా దేవుడి పూజ సమానం..అందుకే పూజ అయ్యాక కాళ్ళు కడుక్కోక పోవడం మంచిదే..ఆ పూజ దోష నివారణ పూజ కాబట్టి ఎక్కడికి వెల్లకూడదు.. నేరుగా ఇంటికి రావాలి..ఇది గుర్తుంచుకోండి..

Read more RELATED
Recommended to you

Latest news