కెసీఆర్ సారూ.. ఇదేం పని..ఇంత నిర్లక్ష్యమా?

-

ప్రభుత్వ అధికారులు ప్రభుత్వ దావఖానాలో చూపించుకోండి..మీ ప్రాణాలకు మా ప్రాణాలు అడ్డు అని ఎన్నో ప్రమాణాలు చేస్తారు..ఏం జరిగిన మాది బాధ్యత అని భరోసా ఇస్తారు.అయితే కొన్ని ఆసుపత్రులలో ఠాగూర్ సినిమాను చూపిస్తున్నారు.ఇప్పుడు ఏకంగా బ్రతికున్న మనుషులను పట్టించుకోలేదు సరి..ప్రాణం తో ఉన్న వారిని కూడా రాతలతో చంపెస్తున్నారు..ఇప్పుడు గలాంటి ముచ్చట ఒకటి జరిగింది.బ్రతికున్న యువతికి చనిపోయినట్లు రాసారు..వామ్మో అలా ఎలా రాస్తారు అనుకుంటున్నారు కదా.. అసలు విషయం ఏందో ఒకసారి చూడండి..

తెలంగాణ రాష్ట్రం సంగారెడ్డి జిల్లాలోని జహిరాబాద్‌ ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్‌ ప్రవర్తించిన తీరే ఉదాహరణ. అస్వస్థతకు గురైన యువతిని వైద్యం కోసం ప్రభుత్వ ఆసుపత్రి కి తీసుకెళ్తే…చనిపోయిందని ఏకంగా ఒక పేపర్‌పై రాసిచ్చారు. పేషెంట్‌ తాలుకు బంధువులకు ఎక్కడో కాస్త నమ్మకం ఉండటంతో ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్తే ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్ చెప్పిన మాట అబద్ధమని తేలింది..

జహిరాబాద్ మండలం చిన్న హైదరాబాద్‌కి చెందిన నర్సింహులు, శారద దంపతుల కుమార్తె అర్చనకు మునిపల్లి మండలం తాటిపల్లికి చెందిన యువకుడితో వివాహం జరిగింది. ఈనెల 7వ తేదిన అర్చన అత్తారింట్లో ఉపవాసదీక్ష చేస్తుండగా నీరసంతో కళ్లు తిరిగి కిందపడిపోయింది. అపస్మారకస్థితిలో ఉన్న అర్చనను కుటుంబ సభ్యులు జహిరాబాద్‌ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. జనరల్ సర్జన్, డ్యూటీ డాక్టర్ సంతోష్ అర్చనకు ఈసీజీ తీయించి చనిపోయిందని నిర్ధారించారు..

డాక్టర్ రాసిచ్చిన లెటర్‌తో పాటు ఆమెకు ట్రీట్‌మెంట్ చేయమని చెప్పిన విషయాన్ని జిల్లా వైద్యాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. తమకు న్యాయం చేయాలని డాక్టర్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు..ఇకపోతే ఆసుపత్రి రిజిస్టర్ లో మాత్రం ఆమెను వేరే ఆసుపత్రికి తీసు కెల్లమని రిఫర్ చేసినట్లు కొత్త కథనం క్రియేట్ చేసారు.పెద్ద సారూ దృష్టికి తీసుకెళ్తే పల్స్ పడిపోయాయి..గది గిది అంటూ బుకాయించే ప్రయత్నం చేశారు.దీనిపై కెసీఆర్ సారూ ఏ ముచ్చట చెబుతారో..డాక్టర్ల వేటు వేస్తారో చూడాలి.ఇదండీ సర్కారు ఆసుపత్రుల తీరు..

Read more RELATED
Recommended to you

Latest news