రేవంత్ రెడ్డి తనపై అనుచిత వ్యాఖ్యలు చేశారని, కానీ ఆయనపై ఈసీ ఎందుకు చర్యలు తీసుకోలేదని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రశ్నించారు. ‘నా ప్రచారంపై ఈసీ 48 గంటల నిషేధం విధించింది. కానీ రేవంత్ నా పేగులు మెడలో వేసుకుంటా, గుడ్లు పీకుతా అన్నాడు. ఆయనపై ఈసీ చర్యలు తీసుకోవట్లేదని ప్రశ్నించారు. నా తరఫున బీఆర్ఎస్ శ్రేణులు 96 గంటలు ప్రచారం చేస్తాయి’ అని మహబూబాబాద్ రోడ్ షోలో కేసిఆర్ ప్రసంగించారు.
కాగా, తాజాగా కేసీఆర్కు కేంద్ర ఎన్నికల కమిషన్ బిగ్ షాక్ ఇచ్చింది. ఇవాళ రాత్రి 8 గంటల నుంచి 48 గంటల పాటు ఆయన ప్రచారం చేయకుండా నిషేధం విధించింది.లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాజకీయ నాయకులు ఒకరిపై మరొకరు తీవ్రస్థాయిలో విమర్శలు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 5న సిరిసిల్ల సభలో కేసిఆర్ కాంగ్రెస్పై చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలపై ఎన్నికల కమిషన్ చర్యలు చేపట్టింది. కేసీఆర్ ఎలాంటి సభలు, ర్యాలీలు, ఇంటర్వ్యూల్లో పాల్గొనవద్దని స్పష్టం చేసింది.