ములాఖత్.. మిలాఖత్‌లతోనే పుట్టిన పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కాదా..? ఢిల్లీకి సీఎం జగన్ వెళ్లి ఎవరితో ములాఖత్.. మిలాఖత్ అవుతున్నారని ప్రజా పద్దుల కమిటీ ఛైర్మన్ పయ్యావుల కేశవ్ ప్రశ్నించారు. గురువారం ఆయన అసెంబ్లీ వద్ద మీడియాతో మాట్లాడారు. దశాబ్ద కాలంగా సీఎం జగన్ ఆస్తుల కేసు ప్రస్తావన రాకపోవడానికి ఏ ములాఖత్.. మిలాఖత్ కారణమని నిలదీశారు. స్కిల్ డెవలప్‌మెంట్ కేసు లో ఒక్క రూపాయి కూడా పక్కకు పోలేదన్నారు. ఎవరైనా ఆధారాలు సేకరించి అరెస్ట్ చేస్తారని.. కానీ అరెస్ట్ చేసి ఆధారాలు సేకరిస్తామని సీఐడీ అధికారులు నిస్సిగ్గుగా చెప్పుకుంటున్నారని మండిపడ్డారు పయ్యావుల కేశవ్.
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుని రాజమండ్రి సెంట్రల్ జైలులో వేశారు. ఆ జైలులో సదుపాయాలు సరిగ్గా లేవు. జైలు ఖైదీ మరణించాడు. దోమలు విపరీతంగా ఉండటంతో డెంగీ, మలేరియా వంటి వ్యాధులు సంభవించే అవకాశం ఉంది. చంద్రబాబును హౌస్ అరెస్ట్ చేయాలని టీడీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు.