రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడిందన్నారు టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్. రాష్ట్రంలో పాలన సరైన విధంగా జరగడం లేదని గవర్నర్ గారు కామెంట్స్ చేశారని అన్నారు. రాజ్యాంగం ప్రకారం ఎన్నో అధికారాలు ఉన్న వ్యక్తి అసహనం వ్యక్తం చేశారని తెలిపారు. రాష్ట్రంలో అవినీతి పెరిగిపోయింది..విచ్చలవిడి తనం పెరిగిందన్నారు. స్వయానా గవర్నర్ సరైన ప్రోటోకాల్ ఇవ్వడం లేదని, గౌరవం ఇవ్వడం లేదని ఎన్నో సార్లు చెప్పారని గుర్తు చేశారు.
రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయన్నారు. గవర్నర్ గారికే అవమానాలు కలుగుతుంటే ప్రజల పరిస్థితి అర్థం చేసుకోవాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కు మధ్య లోపయికార ఒప్పందాలు ఉన్నాయని ఆరోపించారు. ఈ రెండు పార్టీలు వేరు కాదన్నారు. గవర్నర్ కు అవమానం కలుగుతుంటే కేంద్రం ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. ఇది చూస్తే పూర్తిగా అర్దం అవుతుందని.. కేసిఆర్,అమిత్ షా,మోడీ అంత ఒక్కటేనన్నారు. గవర్నర్ ఆవేదన వ్యక్తం చేయడం బాధకరమన్నారు.