దేశంలో రైతుకి ఉన్న ప్రాధాన్యత ఏంటి…? రాజకీయ నాయకుడికి ఎన్నికలకు అవసరం… యువతకు సోషల్ మీడియా పోస్ట్ లకు అవసరం… మరి కొంత మందికి పొలాల్లో ఫోటోలు దిగడానికి అవసరం… మరి కొంత మంది నీతి కథలు చెప్పడానికి, వాళ్లకు అప్పులు ఇవ్వడానికి, భారీగా వడ్డీలు వసూలు చేయడానికి అవసరం. మరి రైతుల కష్టాలు…? వాళ్ళ అప్పుల బాధలు…? పచ్చటి పొలం వెనుక ఉన్న రక్తపు మరకలు…? ఎవరికి కనపడవు… ఎందుకంటే దేశం వినోదానికి అలవాటు పడింది కాబట్టి. రైతు అనే వాడు ఒక వినోదాన్ని పంచె వాడు మాత్రమే.
రెండు రోజుల క్రితం ఒక రైతు… ఎమ్మార్వో ని హత్య చేసాడు… అత్యంత పాశవికంగా ఆమెను తగలబెట్టాడు. వెంటనే అతను కూడా కాల్చుకున్నాడు, పోలీసులకు లొంగిపోయాడు… అసలు దీని వెనుక ఉన్న కారణం ఏంటి అంటే ఎక్కువగా వినపడుతుంది ఆమె అతనిని లంచం కోసం పీడించడమే. తన భూమికి సంబంధించిన కాగితాల కోసం తిరుగుతుంటే రైతుని అసలు లెక్క చేయడం లేదని, బ్రతిమిలాడినా ఫలితం లేకుండా పోయిందని… అందుకే విసుగు చెందిన రైతు ఆమెను కాల్చేసాడని… అందుకే ఇప్పుడు సోషల్ మీడియా రైతుకి మద్దతు ఇస్తుంది.
వందల మంది రైతులు పంటలు నాశనం అయి, సాగు నీరు లేక, అప్పులు తీర్చలేక, పంటలకు సరైన ధరలు లేక ఆత్మహత్యలు చేసుకుంటుంటే ఒక్కడు కూడా ఎందుకు మాట్లాడటం లేదని, అన్నం పెట్టె రైతన్న అలా కాళ్ళు అరిగేలా వేలకు వేలకు వేలు జీతం తీసుకునే ఒక ఆఫీసర్ చుట్టూ తిరిగితే విసుగు చెంది హత్య చేస్తే ఎందుకు ఇంత రాద్దాంతం చేస్తున్నారని…? అంటే ఒక ప్రభుత్వాదికారికి ఉన్న విలువ రైతుకి లేదా…? ధర్నాలు చేసే వాళ్లకు రైతుల కష్టాలు తెలియవా…? అందుకే సోషల్ మీడియాలో రైతుకి విపరీతమైన మద్దతు వస్తుంది.