విషయాధారం : సోషల్ మీడియాలో నడుస్తున్న చర్చ !
ఒకరిని ఉద్దేశించి మాట్లాడుతూ మాట్లాడుతూ మరొకరిని సీన్ లోకి తీసుకు రావడం సంబంధిత వ్యక్తులకు చెందిన అభిమానుల సానుభూతినో సహానుభూతినో తమ ఖాతాలో తమకు చెందేవిధంగా వేసుకోవడం టీవీ నైన్ అనే మీడియాకు ఓ అలవాటు. అసలీ వివాదంలో దేవీ నాగవల్లి అనే యాంకర్ ఎందుకని తారక్ పేరు తెచ్చారని..పోనీ ఆ రోజు అక్కడికి వచ్చిన ప్యానలిస్ట్ తారక్ గురించి ప్రస్తావించారే అనుకుందాం. తారక్ కు విష్వక్ కు పోలికేంటి.. ఆయన రేంజ్ తనది అని ఏనాడయినా విష్వక్ చెప్పాడా లేదా యాటిట్యూడ్ ను షో చేశాడా.. ఆ మాటకు ఇంతకుమించిన యాటిట్యూడ్ ను నాని (టక్ జగదీశ్ సినిమా సమయాన) షో చేశాడు. అవేవీ మరీ అంత వివాదాలకు నోచుకోలేదు.
ఏదో ఒకట్రెండు రోజులు డిస్కషన్ నడిచి ఆగిపోయాయి.. అదే సమయంలో ఆయన నటించిన టక్ జగదీశ్ అనే సినిమా కూడా ఎత్తిపోవడంతో ఇక ఊసే లేకుండా పోయింది. ఓ హీరో యాటిట్యూడ్ ను షో చేస్తే తప్పేంటి ? బన్నీ కూడా అదే కోవలో ఉంటాడు. మరి ఆయన్ను టార్గెట్ చేసి విష్వక్ ను ఉద్దేశించి అన్న మాటలేవో ఆయన్ను ఉద్దేశించి అనగలరా? కనుక ఈ విషయంలో ఎవరు నియంత్రణ కోల్పోయినా తప్పే ! విష్వక్ క్షమాపణలు చెప్పింది కనీసం ఇలాంటి ఒక్కటి కూడా ఇంతవరకూ టీవీ నైన్ చేయలేదు చేయదు కూడా ! కనుక తారక్ ను పొగిడి విష్వక్ ను తిట్టడం కూడా సబబు కాదు.ఆ పని ఆ యాంకర్ చేయకూడదు కూడా ! ఓ విధంగా స్టూడియోకు పిలిచి అవమానించడం కూడా తప్పే ! ఇవన్నీ ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చకు వస్తున్న విషయాలే !
కొన్ని వివాదాల కారణంగా కొందరు పెద్దవాళ్లవుతారు. కొందరి చేష్టల కారణంగా సానుభూతి పెరుగుతుంది. ప్రాంక్ వీడియోలు కొత్తవి కావు. ఆ మాటకు వస్తే మల్లెమాల టీం కూడా కొన్ని ప్రాంక్ కాల్స్ చేసి ప్రముఖులను సీన్లోకి తీసుకువచ్చింది. అవన్నీ ఫన్ కోసం.. నా షో నా ఇష్టం కావాలంటే ఓ సారి చూడండి. యాంకర్ చంటి ఇలాంటివెన్నో చేశాడు. బాబోయ్ అదే పెద్ద నేరం అయితే జబర్దస్త్ తో రోజా (ఇప్పుడు లేరు న్యాయమూర్తి గా) ఎన్ని బూతులు మాట్లాడారో ! ఒక్కసారి పాత వీడియోలు చూస్తే మహిళలు తలదించుకునే మాటలు, ముఖ్యంగా డబుల్ మీనింగ్ డైలాగ్స్ ఎన్ని అన్నారో ! అయినా కూడా వాటిపై హెఆర్సీకి పాపం గౌరవ లాయర్ అరుణ్ కుమార్ ఫిర్యాదు చేయలేదు. ఇంకా చెప్పాలంటే యూ ట్యూబ్ లోనూ ఇంకా మిగతా డిజిటల్ ప్లాట్ ఫాంలపై ఎన్నో జుగుప్సాకర విజువల్స్ వస్తున్నాయి. వాటిపై కూడా కేసు ఫైల్ చేయాలి.ఇవేవీ కాకుండా విష్వక్సేన్ పై కేసు ఏంటి? ఆయన్ను తారక్ తో పోల్చడం ఏంటి? ఇవన్నీ ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చకు వస్తున్న విషయాలే !
ఏదో ఓ సందర్భంలో చెప్పి ఉంటాడు నేను తారక్ ఫ్యాన్ ని అని.. అది పట్టుకుని దేవీ నాగవల్లి తారక్ ది ఓ రేంజ్.. ఈయనేంటి ఇలా మాట్లాడుతున్నారని తెగ చెబుతున్నారు మాటలు..బాగున్నాయి ఇవన్నీ వినేందుకే బాగుంటాయి. తారక్ ను కూడా మీరు ఇరిటేట్ చేయండి ఆయన కూడా బూతులే తిడతాడు కానీ శాంతి మంత్రాలు వల్లించడు. ఆ విషయం టీవీ నైన్ దేవి తెలుసుకుంటే మేలు. అసలు టీవీ 9లో డిస్కషన్లేంటి.. టీవీనైన్ లో నడిచే ప్యానల్ ఏంటి బాబోయ్ ! సాక్షాత్తూ ఓ విపక్ష నేతనే ఎంతో కించపరిచి మాట్లాడిన రోజులు మరిచిపోకండి. జగన్ ను ఆ రోజు రవిప్రకాశ్ అండ్ కో టార్గెట్ చేశారో మరిచిపోకండి. వార్తల కన్నా టీవీనైన్ లో వదంతులు వాటికి మించి వ్యాఖ్యలు ఇవే కదా ఉంటాయి. వీటిపై కూడా మాట్లాడదామా ? ఇవన్నీ ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చకు వస్తున్న విషయాలే !