ఘనంగా ప్రారంభమైన చార్​ధామ్​ యాత్రకు.. కానీ..

-

దేశంలోనే ఎంతో సుప్రసిద్ధమైన చార్ ధామ్ యాత్ర నేడు ఘనంగా ప్రారంభమైంది. వేలాది మంది భక్తులు, ఆలయ కమిటీ సభ్యుల సమక్షంలో గంగోత్రి, యమునోత్రి ఆలయాలను తెరిచారు. ఉదయం 11:15 నిమిషాలకు గంగోత్రి ఆలయ ద్వారాలను, మధ్యాహ్నం 12:15 నిమిషాలకు యమునోత్రి ద్వారాలను తెరిచి.. అమ్మవార్ల విగ్రహాలను ప్రత్యేకంగా అలంకరించిన పూజలు చేశారు నిర్వహించారు. అయితే .. ఈ సందర్బంగా.. ఉత్తరాఖండ్‌ సీఎం పుష్కర్‌సింగ్‌ ధామి సతీసమేతంగా గంగోత్రి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు.

Char Dham Yatra to Begin from May 3 Uttarakhand Govt Fixes Daily Pilgrims Limit

కరోనా కారణంగా రెండేళ్లపాటు చార్‌ధామ్‌ యాత్ర నిలిచిపోగా ఈసారి భక్తులు పెద్దసంఖ్యలో తరలివస్తారని ఉత్తరాఖండ్‌ అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే ఈ క్రమంలో గంగోత్రికి రోజుకు 7వేల మందిని, యమునోత్రికి రోజుకు 4వేల మంది భక్తులను మాత్రమే అనుమటించనున్నట్లు అధికారులు వెల్లడించారు. అంతేకాకుండా.. కేదార్‌నాథ్‌ ఆలయాన్ని ఈనెల 6న, బద్రినాథ్‌ ఆలయాన్ని ఈనెల 8న తెరవనున్నట్లు పేర్కొన్నారు. కేదార్‌నాథ్‌ ఆలయ దర్శనానికి రోజుకు 12వేలు మందిని, బద్రినాథ్‌కు 15 వేల మంది భక్తులను మాత్రమే అనుమతిస్తామని అధికారులు ప్రకటించారు.

 

Read more RELATED
Recommended to you

Latest news