కోస్తాంధ్రకు విస్తారంగా వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరిక!

-

ఏపీలో రానున్న రెండ్రోజుల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.శుక్రవారం ప్రకాశం, కర్నూలు, నంద్యాల, శ్రీ సత్యసాయి, వైఎస్‌ఆర్, అన్నమయ్య, అనంతపురం, చిత్తూరు, తిరుపతిలో భారీ వర్షాలు కురుస్తాయని విపత్తు నిర్వహణ సంస్థ ప్రకటించింది. అదేవిధంగా అల్లూరి, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడులో తేలికపాటి వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది.

Rain in Hyderabad since night Telangana for 3 days

అటు ఏపీలోని ఉమ్మడి కర్నూలు, కడప జిల్లాల్లో వర్షం దంచి కొట్టిన విషయం తెలిసిందే. కర్నూలు జిల్లా ఆలూరులో కల్లే వాగు వంతెనపైకి వరదనీరు చేరింది. ఇకపోతే తెలంగాణలోని హైదరాబాద్‌లో అడపాదడాపా వర్షాలు పడుతున్నాయి. ఉదయం ఎండ కొడుతున్నా సాయంత్రం వరకు వాతావరణం ఒక్కసారిగా చల్లగా మారిపోయి చెదురుమొదురు జల్లులు కురుస్తున్నాయి. రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లొనూ అక్కడక్కడ వర్షాలు కురుస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news