దిశా అత్యాచార నిందితుల్లో ఒకడైన చెన్నకేశవులు భార్య ఆడ పిల్లకు జన్మనిచ్చింది. శుక్రవారం సాయంత్రం ఆమె ప్రసవించింది. ఆమె పేరు దిశగా నామకరణం చేసినట్టు సమాచారం. గత ఏడాది నవంబర్ లో దిశా ను అత్యంత పాశవికంగా అత్యాచారం చేసి హత్య చేసారు నలుగురు నిందితులు, మహ్మద్ ఆరీఫ్, జొల్లు శివ, జొల్లు నవీన్, చెన్న కేశవులు ఆమెను అత్యాచారం చేసి హత్య చేసారు. వారిలో చెన్నకేశవులు ఒక్కడికే వివాహం అయింది. చెన్న కేశవులు నేరానికి పాల్పడిన సమయంలో ఆమె గర్భిణి.
తన గ్రామంలో ఉండే అమ్మాయినే ప్రేమించి వివాహం చేసుకున్నాడు. ఇక నలుగురు నిందితులను విచారణ సమయంలో పోలీసులు కాల్చి చంపారు. ఘటనా స్థలంలో విచారణ సందర్భంగా వాళ్ళు పోలీసుల మీద దాడికి పాల్పడటం తో వెంటనే వారిని అక్కడే కాల్చి చంపారు. ఈ ఘటన ప్రపంచ వ్యాప్తంగా సంచలనంగా మారింది. నిందితులను కాల్చి చంపడంపై పలువురు అప్పుడు హర్ష౦ వ్యక్తం చేసారు. ఈ ఘటన పార్లమెంట్ లో కూడా ప్రకంపనలు సృష్టించింది. మహిళల భద్రతపై అనేక అనుమానాలు ఆందోళనలు అప్పటి నుంచి మొదలయ్యాయి.