మహారాష్ట్రలోని జబల్పూర్ కి చెందిన మహిళకు కొన్నేళ్ల క్రితం వివాహమైంది. భర్త, పిల్లలతో హ్యాపీగా ఉండే ఆమెకు సోషల్ మీడియాలో ఒక యువకుడు పరిచయమయ్యాడు. మహిళ కూడా భర్త ఉద్యోగానికి వెళ్ళాక అతనితో మాట్లాడడం ప్రారంభించింది. తనకు పెళ్లి కాలేదని తెలుపుతూ ప్రేమ సూక్తులు చెప్పుకొచ్చింది. దీంతో సదరు యువకుడు ఈమెతో ప్రేమలో పడ్డాడు.
అనంతరం ఇద్దరూ న్యూడ్ కాల్స్ కూడా మాట్లాడుకోవడం ప్రారంభించారు. ఇలా సాగుతున్న వీరి బంధంలో ఒకరోజు యువకుడు పెళ్లి మాట ఎత్తాడు. దీంతో చేసేదేం లేక మహిళ తనకు పెళ్లి అయిందని, పిల్లలు ఉన్నారని చెప్పింది.
అయినా పర్లేదని, ఆమె మాత్రమే కావాలని పట్టుబట్టాడు. భర్తకు విడాకులు ఇచ్చి తనతో వచ్చేయాలని, లేకపోతే తన నగ్న వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానని బెదిరించాడు। ఇక సదరు మహిళ అతడి బెదిరింపులు ఎక్కువ కావడంతో భర్తకు విషయం చెప్పి భర్త సాయంతో పోలీసులను ఆశ్రయించింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.