అందితే జుట్టు అందకపోతే కాళ్ళు అన్నట్టు ఉంటుంది అగ్ర రాజ్యం అమెరికా పరిస్థితి. వాళ్ళ మాట వింటే ఒకరకంగా లేకపోతే మరో రకంగా ఉంటుంది ఆ దేశం పరిస్థితి. అమెరికాలో ఇప్పుడు కరోనా కేసులు పెరుగుతున్నాయి. దీనితో ఆ దేశానికి ప్రపంచ దేశాల అవసరం వచ్చింది. అక్కడ నాలుగు లక్షల వరకు కేసులు ఉండటం ఇంకా కేసులు పెరిగే అవకాశం ఉన్న నేపధ్యంలో అమెరికా జాగ్రత్తలు పడుతుంది.
తమ పౌరులను కాపాడుకోవడానికి అమెరికా చాలా కష్టాలు పడుతుంది. చిన్న తేడా వచ్చినా సరే భారీగా ప్రాణాలు కోల్పోయే అవకాశాలు ఉంటాయి. అందుకే ఇప్పుడు ఆ దేశం మరింత దిగజారి ప్రవర్తిస్తుంది అనే ఆరోపణలు ఎక్కువగా వినపడుతున్నాయి. ఇతర దేశాలను బెదిరించి ఆ దేశం సహాయం పొందాలని చూస్తుంది. మన దేశం నుంచి ఇప్పటికే మందులను అమెరికా తీసుకున్న సంగతి తెలిసిందే.
ఇప్పుడు ఆఫ్రికా దేశాల విషయంలో కూడా ఇదే విధంగా చేస్తుంది. అక్కడి వైద్యులను అమెరికా తీసుకొస్తుంది. ఆఫ్రికా దేశాలు అన్నీ కూడా అమెరికా చెప్పినట్టు చేస్తాయి. అందుకే ఇప్పుడు అమెరికా వాళ్ళ వైద్యులను తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తుంది. దీనితో అక్కడి ప్రజల్లో భయం మొదలయింది. తమకు కరోనా కేసులు పెరుగుతుంటే అమెరికా ఇలా ప్రవర్తించడం ఎంత వరకు సమంజసం అని అక్కడి ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.