జనసేన బాధ్యతలు చిరంజీవి తీసుకుంటారా…?

-

మెగాస్టార్ చిరంజీవి రాజకీయాల్లోకి వస్తారా లేదా అనే దానిపై ఇప్పుడు స్పష్టత రావడం లేదు. భారతీయ జనతా పార్టీ నుంచి రాజకీయాల్లోకి వచ్చే అవకాశం ఉందని చాలామంది భావిస్తున్నారు. కానీ చిరంజీవి మాత్రం రాజకీయ ప్రవేశం విషయంలో ఎటువంటి స్పష్టత కూడా ఇవ్వటం లేదు. కానీ చిరంజీవి విషయంలో మీడియాలో వచ్చే ప్రచారం అంతా ఇంతా కాదు. ఇక చిరంజీవి త్వరలోనే జనసేన పార్టీలో కూడా కీలక పాత్ర పోషించవచ్చు.

భారతీయ జనతా పార్టీ… జనసేన పార్టీని ముందుకు నడిపించవచ్చు అని కొంతమంది భావిస్తున్నారు. ప్రస్తుతం సినిమాలు చేస్తున్న చిరంజీవి సినిమాలకు గుడ్బై చెప్పే అవకాశాలు ఉన్నాయని రాజకీయాల్లోకి పూర్తిస్థాయిలో రావడానికి ఇదే సరైన సమయమని చిరంజీవి భావిస్తున్నారని కొంతమంది అంటున్నారు. గతంలో ప్రజారాజ్యం విషయంలో చిరంజీవి కాస్త తప్పులు ఎక్కువే చేశారు.

ఇప్పుడు ఆ తప్పులు జరగకుండా ఉండడానికి సిద్ధంగా ఉన్నారని కూడా తెలుస్తుంది. త్వరలోనే ఆయనకు సంబంధించి ఒక నిర్ణయాన్ని కూడా పవన్ కళ్యాణ్ ప్రకటించవచ్చు. జనసేన పార్టీ అధ్యక్ష బాధ్యతలను ఆయన తీసుకోవచ్చని కొంతమంది అభిప్రాయపడుతున్నారు. మరి ఈ విషయంలో ఏం జరుగుతుందో చూడాలి. ఇక చిరంజీవి గనుక జనసేన పార్టీ లోకి వస్తే చాలా మంది కాపు సామాజిక వర్గం నేతలు ఇతర పార్టీల నుంచి జనసేన పార్టీలోకి రావచ్చని కూడా అంచనా వేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news