మంకీ ఫాక్స్ కు మందు తయారు చేస్తా – ఆనందయ్య

-

నెల్లూరు జిల్లా కృష్ణ పట్నానికి చెందిన ఆనందయ్య రెండేళ్ల క్రితం కరోనా విరుగుడు పేరిట ఇచ్చిన నాటుమందుకు జనం విపరీతంగా ఎగబడ్డారు. ప్రకృతిలో దొరికే వనమూలికలతో ఆయన ఈ నాటు మందును తయారు చేశారు. అయితే దీనిపై అప్పట్లో భిన్నభిప్రాయాలు వినిపించాయియి. ఆనందయ్య ముందు పని చేస్తుందని కొంతమంది చెప్పగా.. దానికి శాస్త్రీయత లేదని మరికొంతమంది ఆరోపించారు. చివరకు ఆయుష్ శాఖ ప్రతినిధులు సైతం ఆ మందును పరిశీలించారు. ఆనందయ్య ఇస్తున్న మందులొ ఎటువంటి హానికర పదార్థాలు లేవని నిర్ధారించారు.

కంటిలో వేసే చుక్కల మందు పై మాత్రం అభ్యంతరం చెప్పారు. ఆనందయ్య ముందుకు ఆయుర్వేద మందుగా గుర్తింపునివ్వడానికి ఒక సప్లిమెంట్ గా.. ఇమ్యూనిటీ బూస్టర్ గా అది ప్రాచీర్యంలోకి వచ్చింది. దీంతో ప్రభుత్వం కూడా దానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే తాజాగా దేశంలో మంకీ ఫాక్స్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మంకీ ఫాక్స్ కు మందు తయారు చేయనున్నట్లు తెలిపారు ఆనందయ్య.

ఆంధ్రప్రదేశ్లోని విశాఖలో ఏర్పాటు చేసిన బీసీ వెల్ఫేర్ జేఏసీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ప్రకృతి వైద్యంలో ప్రతి వ్యాధికి మందు ఉంటుందని ఆయన తెలిపారు. అయితే ఇప్పటివరకు తన వద్దకు ఒక్క మంకీ ఫాక్స్ రోగి కూడా రాలేదని.. వచ్చినట్లయితే వ్యాధి లక్షణాలను బట్టి మందు తయారు చేస్తానని వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news