రాజీనామా చేస్తా – సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు

-

అప్పులు చేయడంలో మోడీ ని మించిన ఘనుడు లేడని మండిపడ్డారు సీఎం కేసీఆర్. కాంగ్రెస్ వాళ్ళు చేసిన పనిని కూడా చెప్పుకోలేకపోతున్నారని అన్నారు. మన్మోహన్ సింగ్ హయాంలో 14% అప్పులు తగ్గించారని, మోడీ హయాంలో అప్పులు 54% పెరిగాయి అన్నారు. మోడీ హయాంలో ఎక్కడైనా వృద్ధిరేటు ఉందా? అని ప్రశ్నించారు. 2024 తర్వాత బిజెపి కతం అవుతుందన్నారు. బంగ్లాదేశ్ వార్ తర్వాత ఇందిరాగాంధీని వాజ్పేయి కాళికా అన్నారని గుర్తు చేశారు.

అలహాబాద్ కోర్టు తీర్పుతో ఇందిరా గాంధీ ప్రభుత్వం కూలిపోయింది అన్నారు సీఎం కేసీఆర్. ఆ తర్వాత వచ్చిన జనతా పార్టీ కొన్ని తప్పులు చేసిందని.. అనంతరం మళ్లీ ఇందిరా గాంధీకే పట్టం కట్టారని తెలిపారు. మేక్ ఇన్ ఇండియా జోకింగ్ ఇండియా గా మారిపోయింది అన్నారు. కాంగ్రెస్, బిజెపి రెండు దేశాన్ని ముంచాయని పండిపడ్డారు. తాను చెప్పిన దాంట్లో ఒక్క అబద్ధం ఉన్న రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు. “కాంగ్రెస్ ది లైసెన్స్ రాజ్, మోడీది సైలెన్స్ రాజ్.. ఎన్డీఏ అంటే నో డేటా అవైలబుల్” అని ఎద్దేవా చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news