మునుగోడు ఉప ఎన్నిక కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్వార్ధం వల్లే వచ్చిందని ఆరోపించారు మంత్రి జగదీష్ రెడ్డి. ఆరు నెలల కిందట రూ. 18 వేలకోట్ల కాంట్రాక్టుు వచ్చినట్లు నిన్న రాజగోపాల్ రెడ్డి స్వయంగా తెలిపారని జగదీశ్ రెడ్డి పేర్కొన్నారు. మునుగోడు అభివృద్ధి కోసం రాజీనామా చేశానంటున్న రాజగోపాల్ రెడ్డి 3 సీట్లున్న పార్టీలోకి వెళ్తే నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందా? అని ప్రశ్నించారు.
మునుగోడు ప్రజల నమ్మకాన్ని అమ్ముకున్నారని మండిపడ్డారు. డబ్బుల కోసం ఆశపడి అమ్ముడుపోయి.. త్యాగాలు చేశాం అనడం హాస్యాస్పదమన్నారు. కాంట్రాక్టుల కోసమే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బిజెపిలోకి వెళ్లినట్లు బహిర్గతమైందని వ్యాఖ్యానించారు. రాజగోపాల్ రెడ్డి నేడు దొరికిపోయిన దొంగలా మిగిలారని వ్యాఖ్యానించారు. బహిరంగ మార్కెట్ లో అమ్ముడుపోయాడని విమర్శించారు. అమ్ముడుపోయిన రాజగోపాల్ రెడ్డికి మళ్లీ పోటీ చేసే అర్హత ఉందా ? అని ప్రశ్నించారు.