ప్రతి సంవత్సరం ఇంగ్లాండ్ లో వింబుల్డన్ గ్రాండ్ స్లాం టెన్నిస్ పోటీలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ పోటీల కోసం చేసిన ఏర్పాట్లలో భాగంగా టెన్నిస్ కోర్ట్ ల వద్ద కొన్ని క్వయిట్ రూమ్ లను ఏర్పాటు చేయడం జరిగింది. కానీ ఈ టోర్నీ నిర్వాహకులు తెలిపిన ప్రకారం ఈ రూమ్ లను ఏర్పాటు చేసింది కేవలం మెడిటేషన్ లేదా ప్రార్ధనలు కోసం మాత్రమే. కానీ ఊహించని రీతిలో ఈ రూమ్ లను కొందరు అసాంఘిక కార్యకలాపాలకు ఉపయోగిచినట్లు వారి దృష్టికి వెళ్ళింది. కొందరు ప్లేయర్లు ఈ రూమ్స్ లో శృంగారాన్ని ఆస్వాదించగా, మరికొందరు ఏమో తమ తమ పార్టనర్ తో ఏకాంతంగా గడపడానికి ఈ రూమ్ లను ఉపయోగించారు. కాగా నిన్న ఎంతో వైభవంగా లండన్ లో వింబుల్డన్ పోటీలు ప్రారంభం అయిన విషయం తెలిసిందే.
అందుకే ఇప్పుడు మాత్రం ఆటగాళ్లకు వార్నింగ్ ఇచ్చారు. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు ఉంటాయని కూడా వింబుల్డన్ నిర్వాహకులు తెలియచేశారు.