దక్షిణాది రాష్ట్రాల్లో ఎక్కడా అమూల్ కు చోటు లేదని టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్ర అన్నారు.ఉత్తరాది రాష్ట్ర డెయిరీ అమూల్ ని ఏపీలో ఎందుకు ప్రమోట్ చేస్తున్నారని ప్రశ్నించారు. కేసుల మాఫీ కోసం జగన్ ఏపీకి అమూల్ ను తీసుకువచ్చారని ఆరోపించారు.హెరిటేజ్ వలనే సహకార డెయిరీలు మూతపడ్డాయనడం అబద్ధమని పేర్కొన్నారు. గతంలో హెరిటేజ్ పై హౌస్ కమిటీ వేసి ఏమీ తేల్చలేదన్నారు.ఇంకా ఎన్ని రోజులు చంద్రబాబు, హెరిటేజ్ పై పడి ఏడుస్తారని విమర్శించారు.
చిత్తూరు డెయిరీ తెరిస్తే, తమకు, తమవాళ్లకు చెందిన పాల డెయిరీల మనుగడ దెబ్బతింటుందనే రాజశేఖర్ రెడ్డి, ఇతర కాంగ్రెస్ ముఖ్యమంత్రులు ఆ పని చేయలేదు. వారి బాటలోనే ఇప్పుడు జగన్ రెడ్డి నడుస్తున్నాడు.అమూల్ డెయిరీ ఉత్తరాదిరాష్ట్రాల్లో కొనసాగుతోంది తప్ప, దక్షిణాది రాష్ట్రాల్లో దాని కార్యకలాపాలు లేవు. గతంలో తమిళనాడులో ఒక డెయిరీని ప్రారంభించి కూడా మూసేశారు. అలాంటి డెయిరీని జగన్ రెడ్డి రాష్ట్రంలో ప్రోత్సహించడానికి కారణం తనపై ఉన్న అవినీతి కేసులు, కమీషన్ల కోసమే.స్వయానా కేంద్ర హోంమంత్రి అమిత్ షా కర్ణాటకలోని నందిని డెయిరీని అమూల్ తో కలిసి పనిచేయాలని పిలుపునిస్తే, ఆ రాష్ట్ర ప్రజలు తీవ్రంగా ప్రతిఘటించారు. కర్ణాటక రాష్ట్రంలోని నందిని బ్రాండ్, ఆ రాష్ట్రవాసుల ఆత్మగౌరవానికి ప్రతీక.