వెదర్ అప్డేట్: తెలంగాణ లో పెరిగిన చలి తీవ్రత.

-

తెలంగాణ ను చలి వణికిస్తోంది. ఉదయం 8 దాటిన మంచు దుప్పటి వదలడం లేదు. పలు జిల్లాల్లో ఉష్టోగ్రతలను కనిష్ట స్థాయికి పడిపోతోంది. దీంతో చలి తీవ్రత పెరుగుతోంది. ఉత్తరం నుంచి చల్లని గాలులు వీస్తుండటంతో ఉష్టోగ్రతలు తగ్గి చలి తీవ్రత పెరుగుతోంది. ఉత్తర తెలంగాణ పలు జిల్లాల్లో భారీగా ఉష్టోగ్రతలు పడిపోయాయి. ఆదిలాబాద్ జిల్లాలో కనిష్టంగా 10 డిగ్రీల ఉష్టోగ్రతే నమోదైంది. ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల్లో 12 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. నిర్మల్ జిల్లాలో 14.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మిగతా జిల్లాల్లో కూడా దాదాపుగా ఉష్టోగ్రతలు 20 డిగ్రీల కన్నా తక్కువే ఉన్నాయి.

కాగా…గత మూడు రోజుల నుంచి తెలంగాణలో చలి పెరుగుతోందని గతంలో వాతావరణ కేంద్రం తెలిపింది. తెలంగాణ వ్యాప్తంగా పూర్తిగా పొడి వాతావరణం ఏర్పడి ఉంది. మరో వైపు నేడు బంగాళా ఖాతంలో అల్పపీడనం ఏర్పడుతుందని వాతావరణ శాఖ తెలుపుతోంది. అల్పపీడన ప్రభావంతో తెలంగాణలో చలి తీవ్రత తగ్గే అవకాశం ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news