గిన్నిస్‌బుక్‌లో స్థానం కోసం.. నిమిషంలో మూడన్నర కిలోల కోడికాళ్లు నమిలేసిన యువతి..!!

-

గిన్సిస్‌బుక్‌లో స్థానం కోసం చాలామంది ఏవేవో చేస్తుంటారు. అందరూ చేసేవి చేస్తే అది రికార్డు అవ్వదు. ఏదైనా కొత్తగా వింతగా చేస్తేనే జనాలు గుర్తిస్తారు.గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు కోసం సౌతాఫ్రికా ఏకంగా కోడికాళ్లను కసకసా నమిలిపడేసింది..తను సాధించిన ఈ అరుదైన ఫీట్ చూస్తూ వావ్.. అంటూ ఆశ్చర్యపోవాల్సిందే.!

మీరు ఫుడ్‌ కాంపిటీషన్స్‌ గురించి వినే ఉంటారు.. స్పీడ్‌గా అక్కడ పెట్టినవి తినాలి.. ఇలాంటి ఒక కాంపిటీషన్‌లో కేవలం కోడి కాళ్లు మాత్రమే తినే పోటీని నిర్వహించారు.. అదీ ఉడకబెట్టిన కాళ్లను మాత్రమే తినడం. వినడానికే ఆశ్చర్యంగా ఉన్నా.. ఓ సౌతాఫ్రికా యువతి ఒక్క నిమిషంలో ఏకంగా మూడున్నర కోడి కాళ్లను కసకస నమిలేసి గిన్నిస్ రికార్డు దక్కించుకుంది.

సౌతాఫ్రికాకు చెందిన ఉయోల్వేతు సిమానైల్ అనే మ‌హిళ కోడి కాళ్లు తిన‌డంలో ప్ర‌పంచ రికార్డును నెలకొల్పింది. ఒకే ఒక్క నిమిషంలో ఆమె మూడున్న‌ర కోడి కాళ్లు తిని గిన్నిస్ బుక్‌లో చోటు సంపాదించుకుంది. స్టంబో రికార్డు బ్రేక‌ర్స్ అనే ఎపిసోడ్‌లో భాగంగా సిమానైల్‌తో పాటు మ‌రో ముగ్గురు యువతులు కోడి కాళ్లు తినే పోటీలో పాల్గొన్నారు. ఈ పోటీలో సిమానైల్ ఒక్క నిమిషంలో మూడున్న‌ర కోడి కాళ్ల‌ను నమిలి మింగేసింది. మిగ‌తా ముగ్గురిలో ఏ ఒక్క‌రూ ఆమె తిన్న దాంట్లో సగం కూడా తినలేకపోయారు. అసలు అన్ని కాళ్లు ఎలా నమిలిందో..!!

డ‌ర్బ‌న్‌ ఉమ్లాజీ ఏరియాలోని మ‌షాంప్లేన్స్ లాంజ్ రెస్టారెంట్ అండ్ బార్‌లో ఈ పోటీ జరిగింది. ఈ పోటీలో పాల్గొన్న వారికి ఇచ్చిన ఒక్కో కోడి కాలు 35 గ్రాములు ఉంటుంది. దీన్ని బట్టి చూస్తే సిమానైల్ నిమిషంలో దాదాపు 120 గ్రాములకు పైగా కోడి కాళ్లు నమిలేసింది అన్నమాట. వాస్తవానికి నిమిషంలో 120 గ్రాముల చికెన్ తినడం సులభమే. కానీ, గట్టి ఎముకలు ఉండే కాళ్లను తినడం మాత్రం అంత తేలికైన విషయం కాదు. ప్రతి వేలుకు పదునైన గోళ్ల కూడా ఉంటాయి. వాటిని కొరికి మింగడం సులభం కాదు. ఈ కఠినమైన పోటీలో పాల్గొని ఎక్కువ కోడికాళ్లను తిన్నది కాబట్టే సిమానైల్ గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్‌లో స్థానం దక్కించుకుంది. ఆ యువతి కోడి కాళ్లను తినే వీడియోను గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డ్స్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌లో షేర్‌ చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news