గాల్లోనే ప్రసవించిన మహిళ…!

-

ఒక మహిళ గాల్లోనే ప్రసవించింది. అవును విమానం లో ప్రసవించడంతో అత్యవసర ల్యాండింగ్ చేసారు. సాధారణంగా గర్భం దాల్చిన మహిళలు డేట్ దగ్గరకు వస్తుంటే విమాన ప్రయాణాలకు దూరంగా ఉంటారు. అసలు ప్రయాణాలకే దూరంగా ఉండటమే కాకుండా ఇంటి పట్టున ఉంటారు. అయితే అనుకోకుండా ఒక మహిళ ప్రయాణంలోనే ప్రసవించింది. ఈ ఘటన బెంగాల్ లో జరిగింది.

దోహా నుంచి బ్యాంకాక్‌కు వెళ్తున్న విమానంలో థాయ్‌లాండ్‌కు చెందిన ఒక గర్భిణి మహిళ ఉంది. అయితే ఆమెకు ఉన్నట్టుండి నొప్పులు రావడంతో ప్రసవించింది విమానంలోనే. తెల్లవారుజామున 3 గంటలకు ఖతార్ ఎయిర్‌వేస్‌కు చెందిన క్యాబిన్ సిబ్బంది సహాయంతో మహిళ శిశువుకు జన్మనిచ్చింది. దీనితో విమానాన్ని పైలెట్ కోల్కతా విమానాశ్రయంలో అత్యవసర ల్యాండింగ్ చేసారు.

విమానం కోల్‌కతాలో ల్యాండ్ కావడంతో ఆ మహిళను ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్చారు. తల్లి మరియు బిడ్డ ఇద్దరూ బాగానే ఉన్నారని అధికారులు తెలిపారు. “దోహా నుండి బ్యాంకాక్ క్యూఆర్ -830 కు షెడ్యూల్ చేయని విమానం అత్యవసరం వైద్యం కోసం కోల్కతా విమానాశ్రయంలో ల్యాండ్ అయిందని అధికారులు చెప్పారు. అత్యవసర వైద్యం కోసం కోసం SOS ను ATC కోరిందని ఫ్లైట్ సురక్షితంగా ల్యాండ్ అయిందని ఒక అధికారి మీడియాకు వివరించారు.

Read more RELATED
Recommended to you

Latest news