మహిళాలూ బ్రెస్ట్ క్యాన్సర్ రాకుండా ఉండాలంటే వీటిని తప్పని సరిగా తినండి..!

-

ఎక్కువ మంది మహిళలు బ్రెస్ట్ క్యాన్సర్ సమస్యతో బాధపడుతూ ఉంటారు. బ్రెస్ట్ క్యాన్సర్ సమస్య రాకుండా ఉండాలంటే ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలి. అలాగే ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల కూడా క్యాన్సర్ సమస్య రాకుండా ఉంటుంది. మంచి ఆహారం తీసుకోవడం, సరైన సమయానికి తినడం కూడా చాలా ముఖ్యం. అయితే బ్రెస్ట్ క్యాన్సర్ రాకుండా ఉండాలంటే ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకోవాలి అనేది ఇప్పుడు చూద్దాం.

 

breast cancer

పసుపు:

పసుపు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. ఇది మిమ్మల్ని బాగా ప్రొటెక్ట్ చేస్తుంది. అలానే క్యాన్సర్ బారిన పడకుండా ఇది రక్షిస్తుంది. ఇందులో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు సమృద్ధిగా ఉంటాయి.

సిట్రస్ ఫ్రూట్స్:

విటమిన్-సి, ఫోలేట్, కెరోటినాయిడ్స్, యాంటీఆక్సిడెంట్లు సిట్రస్ ఫ్రూట్స్ లో ఉంటాయి. బ్రెస్ట్ క్యాన్సర్ రాకుండా ఇది చూసుకుంటుంది. యాంటీ క్యాన్సర్ గుణాలు, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఇందులో ఉంటాయి. కనుక కమలా, నిమ్మ, ద్రాక్ష వంటి వాటిని తీసుకోండి.

బెర్రీస్:

స్ట్రా బెర్రీ, బ్లాక్ బెర్రీ, బ్లూ బెర్రీ వంటివి తీసుకోవడం వల్ల కూడా క్యాన్సర్ రాకుండా ఉంటుంది. యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు, యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఇందులో ఎక్కువగా ఉంటాయి. బ్రెస్ట్ క్యాన్సర్ రాకుండా కూడా చూసుకుంటాయి.

దానిమ్మ:

దానిమ్మ తీసుకోవడం వల్ల కూడా బ్రెస్ట్ క్యాన్సర్ రిస్కు ఉండదు. అయితే ఇందులో ఉండే ఫైటోకెమికల్స్ కారణంగా ఇది చక్కటి లాభాన్ని ఇస్తుంది.

ఆకు కూరలు:

ఆకుకూరలు కూడా బ్రెస్ట్ క్యాన్సర్ సమస్య రాకుండా చూసుకుంటాయి. పాలకూర, మెంతికూర మొదలైన వాటిని రెగ్యులర్ గా తీసుకుంటూ ఉండండి. అల్లం, వెల్లుల్లి, ఉల్లి ఉల్లికాడలని కూడా డైట్ లో తీసుకుంటూ ఉండండి. ఇవి కూడా క్యాన్సర్ రాకుండా చూసుకుంటాయి. ఇలా ఈ ఆహార పదార్థాలను మహిళలు డైట్ లో తీసుకుంటే బ్రెస్ట్ క్యాన్సర్ సమస్య బారిన పడకుండా ఉండొచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news