ప్రపంచ క్రికెట్ లో బీసీసీఐ నిర్వహిస్తున్న ఐపీఎల్ ప్రత్యేక స్థానాన్ని పొందింది. ఐపీఎల్ తో భారత్ నుంచే కాకుండా పలు దేశాల నుంచి కూడా మేలైన క్రికెటర్లు పరిచయం అవుతున్నారు. అంతే కాకుండా ఆటగాళ్లుకు, బీసీసీఐ ఆదాయం కూడా భారీగా వస్తుంది. అయితే ప్రస్తుతం జరుగుతున్న పురుషుల ఐపీఎల్ తో పాటు మహిళల ఐపీఎల్ ను కూడా నిర్వహించాలని గత కొద్ది రోజుల నుంచి డిమాండ్ వస్తుంది. అయితే మహిళా ఐపీఎల్ పై తాజా గా బీసీసీఐ చీఫ్ గంగూలీ కీలక ప్రకటన చేశారు. పురుషుల ఐపీఎల్ కు ధీటుగా మహిళల ఐపీఎల్ ను నిర్వహించి తీరుతామని బీసీసీఐ చీఫ్ గంగూలీ ప్రకటన చేశారు.
అయితే వచ్చే ఏడాది నుంచి పూర్తి స్థాయిలో మహిళల ఐపీఎల్ జరుగుతుందని తెలిపారు. అయితే ప్రతి ఏడాది ఉమెన్స్ టీ 20 ఛాలెంజ్ అనే పేరుతో మూడు జట్లతో మిని లీగ్ నిర్వహిస్తున్నారు. అయితే గత ఏడాది కరోనా వ్యాప్తి కారణంగా పురుషుల ఐపీఎల్ ను రెండు విడుతలలో నిర్వహించారు. దీంతో ఉమెన్స్ టీ 20 ఛాలెంజ్ జరగలేదు. అయితే ఈ ఏడాది ఉమెన్స్ ఐపీఎల్ జరుగుతుందా అనే ప్రశ్నకు సమాధానంగా బీసీసీఐ చీఫ్ గంగూలీ ఈ వ్యాఖ్యలు చేశారు.