తెలంగాణ మహిళలకు శుభవార్త..మార్చి 8న అందరికీ సెలవు

-

తెలంగాణ మహిళలకు శుభవార్త. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం మహిళ ఉద్యోగులకు కానుక ఇచ్చింది. మార్చి 8న ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మహిళా ఉద్యోగులకు స్పెషల్ క్యాజువల్ లీవ్ ప్రకటించింది. ఈ మేరకు జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్ మెంట్ ఉత్తర్వులు జారీచేసింది.

అలాగే, మార్చి 8 నుంచి ‘ఆరోగ్య మహిళ’ అనే కార్యక్రమాన్ని తెలంగాణ వ్యాప్తంగా కేసీఆర్‌ సర్కార్‌ అమలు చేయనుంది. మహిళా దినోత్సవం సందర్బంగా ప్రభుత్వం ఈ ‘ఆరోగ్య మహిళ’ అనే నూతన కార్యక్రమం చేపట్టనుంది. సిపీఆర్ పై నిర్దేశిత వర్గాలకు శిక్షణ పూర్తి చేయాలని.. జిల్లా స్థాయి వైద్య, పంచాయితీ, మున్సిపల్, పోలీసు శాఖల సిబ్బంది పర్యవేక్షించాలని ఈ మేరకు ఆర్థిక, వైద్యారోగ్య మంత్రి హరీశ్ రావు, మంత్రి ఎర్రబెల్లి దయాకర్ ఆదేశించారు. ప్రాముఖ్యత గురించి అవగాహన కల్పించాలని… కంటి వెలుగు మరింత ప్రభావవంతంగా నిర్వహించాలన్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news