కరోనా భయంతో మహిళ ఆత్మహత్య

-

విజయవాడ: కరోనా పాజిటివ్ వచ్చిందనే భయంతో మహిళ ఆత్మహత్య చేసుకున్నారు. ఇబ్రహీంపట్నం మండలం గుంటుపల్లి గ్రామానికి చెందిన కుమారి గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. తాజాగా ఆమె కరోనా టెస్టులు చేయించుకున్నారు. ఈ పరీక్షలో పాజిటివ్ నిర్ధారణ కావడంతో ఆమె ఆందోళన చెందారు. ఎవరికీ చెప్పకుండా వెళ్ళి ఇబ్రహీంపట్నం ఎన్టీటీపీఎస్ కూలింగ్ కెనాల్‌లో దూకేశారు. గమనించిన స్థానికులు ఆమను రక్షించేప్రయత్నం చేశారు. కానీ ఫలితం దక్కలేదు. కెనాల్ లోకి దూకిన కొద్దిసేపటికే కుమారి చనిపోయారు. దీంతో ఆమె మృతదేహాన్ని బయటకు తీశారు. ఈ మేరకు కుటుంబసభ్యులు ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు .ఆమె మృతదేహాన్ని పోస్టు‌మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

కాగా కరోనా భయంతో చనిపోవడం సరికాదని పోలీసులు అంటున్నారు. కరోనాను ధైర్యంగా ఎదుర్కోవాలని సూచిస్తున్నారు. చికిత్స తీసుకుంటే తగ్గిపోయే దానికి ఆత్మహత్య చేసుకోవడం దారుణమని అంటున్నారు. ఆత్మహత్యలు చేసుకుని కుటుంబసభ్యులకు విషాదాన్ని మిగల్చొద్దని పేర్కొంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news