వండర్: పెళ్లయిన 2 రోజులకే పండంటి బిడ్డకు జన్మనిచ్చిన తల్లి..

-

కొన్ని సార్లు మన చుట్టూ విచిత్రకరమైన సంఘటనలు మరియు షాకింగ్ విషయాలు జరుగుతూ ఉంటాయి. తాజాగా జరిగిన ఒక సంఘటన ప్రపంచం మొత్తాన్ని ముక్కున వేలేసుకునెలా చేసింది అని చెప్పాలి. పూర్తి వివరాల్లోకి వెళితే… ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని నోయిడా లో ఒక వివాహిత ఇప్పటి వరకూ ఏ మహిళకు సాధ్యం కాని విధంగా చేసి అందరినీ ఆశ్చర్యచకితులను చేసింది. జూన్ 26 వ తేదీన సికింద్రాబాద్ కు చెందిన అమ్మాయితో నోయిదాకు చెందిన అబ్బాయితో వివాహం జరిగింది. పెళ్ళైన తర్వాత రోజు సదరు అమ్మాయి కడుపు నొప్పిగా ఉందని భర్తకు చెప్పడంతో వారు ఆమెను హాస్పిటల్ కు తీసుకువెళ్ళారు. ఆ అమ్మాయిని బాగా పరిశీలించిన వైద్యులు చివరకు ఆమె 7 నెలల గర్భవతి అని కన్ఫర్మ్ చేశారట. ఈ వార్త విన్న భర్త మరియు బందువులు షాక్ తిన్నారు. హాస్పిటల్ నుండి ఇంటికి వెళ్లడంతో… ఆ మరుసటి రోజునే ఆ అమ్మాయి ఒక ఆడబిడ్డకు జన్మను ఇచ్చింది. దీనితో ఫ్యామిలీ లో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి.ఇప్పుడు ఆ వివాహిత పరిస్థితి ఏమిటి ? బిడ్డ ఎవరికి పుట్టింది ? ఇలాంటి ఎన్నో ప్రశ్నలు ఆ కుటుంబాన్ని అతలాకుతలం చేస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news