సోషల్ మీడియాలో ఎప్పుడూ ఏదో ఒక వీడియో వైరల్ అవుతూనే ఉంది. ఎక్కడ ఉన్న టాలెంట్ అయినా సరే.. సోషల్ మీడియా పాపులర్ అయిన తర్వాత మంచి ఫ్లాట్‌ఫామ్‌గా వాడుకోని పైకి వచ్చిన వాళ్లు ఉన్నారు. మన గురించి ఎవరో చెప్పనక్కర్లేదు. మన డప్పు మనమే కొట్టుకోవచ్చు. మన సత్తా మనమే చూపించుకోవచ్చు. చేసే పని మీద మంచి పట్టు ఉంటే ఆ పనితోనే ఆటలాడేసుకుంటారు. మీరు ఛాయ్, చాట్ బండి వాళ్లనూ చేసే ఉంటారు కొందరు ఛాయ్‌ను గ్లాసులోకి పోయడమే పెద్ద సహాస విన్యాసాలు చేసినట్లు హైట్ నుంచి పోస్తారు. ఇక్కడ ఒక అతను రోటీలను డ్రోన్ కెమేరాలు తిప్పినట్లు తిప్పుతున్నారు. అరే ఏంట్రా ఇది అనాల్సిందే వీడియో చూస్తే..!
Be proud of your work pic.twitter.com/X7sJl47dPK
— Tansu YEĞEN (@TansuYegen) June 27, 2023
సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్న ఆ వీడియోలో ఓ వ్యక్తి అత్యంత నైపుణ్యంతో రోటీలు తయారు చేస్తున్నాడు. ఆ వీడియో చూస్తే అతడెంత నైపుణ్యంతో రోటీలు తయారు చేస్తున్నాడో మీకే అర్థం అవుతుంది. సాధారణంగా రుమాల్ రోటీలు గాల్లో ఎగిరేస్తూ తయారు చేయడం గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది. ఈ వీడియోలో కనిపిస్తున్న వ్యక్తి కూడా అలాగే రోటీని గాల్లో మాములూగా ఎగరలేయదు.. ఆ రోటీలను డ్రోన్ కెమెరాలు తిప్పినట్లు తిప్పాడు. అది కాస్త వైరల్ అయింది.
వైరల్ అవుతున్న 18 సెకన్ల పాటు ఉన్న ఈ వీడియోలో ఏముందంటే.. ముక్కుకు, మూతికి ట్రాన్స్‌పరెంట్ మాస్క్ ధరించిన వ్యక్తి మొదటి కాస్తంత పిండి తీసుకున్నాడు. దానిని చేతితో వత్తుతూ కొద్దిగా గుండ్రంగా చేశాడు. ఆ వెంటనే దానిని గాలిలో అంతెత్తు ఎగిరేశాడు. అది కాస్త దూరంగా వెళ్లింది. అక్కడ ఉన్న మరో వ్యక్తి దానిని పట్టుకుంటాడేమో అనుకుంటారు చాలా మంది. కానీ అంతెత్తు గాల్లో ఎగిరేసిన ఆ రోటీ తిరిగి తన వద్దకే వచ్చేస్తుంది. బూమరాంగ్ తరహాలో ఆ రోటీ అలా తన వద్దకే రావడం చూసి అక్కడ ఉన్న వాళ్లు అవాక్కవుతారు. మళ్లీ చేతితో నైపుణ్యంగా రోటీని అందుకున్న ఆ వ్యక్తి దానిని మునివేళ్లపై గిరగిరా తిప్పుతూ, రకరకాల విన్యాసాలు చేస్తూ భలే ఆకట్టుకుంటాడు.. కుడిచేతి చూపుడు వేలిపై ఉంచి బాస్కెట్‌బాల్‌ను తిప్పినట్లు గిరగిరా తిప్పాడు. అతడి నైపుణ్యం చూసిన వాళ్లు చప్పట్లు కొట్టకుండా ఉండలేరు.
జూన్ 27 ఉదయం 10 గంటలకు బి ప్రౌడ్ ఆఫ్ యూ అని క్యాప్షన్ ఇచ్చి పోస్టు చేయగా.. అది కాస్త వైరల్ గా మారింది. ఇప్పటి వరకు 2.2 మిలియన్ల వ్యూస్ వచ్చాయి