WORLD CUP 2023: డివిలియర్స్ తర్వాత “డి కాక్” బ్యాక్ టు బ్యాక్ సెంచరీస్ రికార్డ్ !

-

ప్రస్తుతం లక్నో లో ఆస్ట్రేలియా మరియు సౌత్ ఆఫ్రికా ల మధ్యన వరల్డ్ కప్ లో మ్యాచ్ జరుగుతోంది. ముందుగా టాస్ గెలిచిన ఆస్ట్రేలియా ఫీల్డింగ్ ఎంచుకోవడంతో సౌత్ ఆఫ్రిక బ్యాటింగ్ లో ఆచితూచి ఆడుతోంది. ఓపెనర్ లుగా వచ్చిన డి కాక్ మరియు బావుమా లు మొదటి వికెట్ కు సెంచరీ భాగస్వామ్యాన్ని నెలకొల్పి సౌత్ ఆఫ్రికా కు శుభారంభాన్ అందించారు. అనంతరం బావుమా అవుట్ అయినా.. డి కాక్ డస్సెన్ , మార్ క్రామ్ ల సహాయంతో ఇన్నింగ్స్ ను ముందుకు తీసుకువెళ్లాడు. ఈ దశలో డి కాక్ సెంచరీ మార్క్ ను అందుకున్నాడు. వరల్డ్ కప్ 2023 లో డి కాక్ కు ఇది వరుసగా రెండవ సెంచరీ కావడం విశేషం. వరల్డ్ కప్ లో వరుసగా రెండు సెంచరీ లు అందుకున్న రెండవ సౌత్ ఆఫ్రికా బ్యాట్స్మన్ గా డి కాక్ రికార్డు సృష్టించాడు. ఇతని కన్నా ముందు సౌత్ ఆఫ్రికా మాజీ స్టార్ ప్లేయర్ ఎబి డివిలియర్స్ 2011 వరల్డ్ కప్ లో వరుసగా రెండు సెంచరీ చేశాడు. సెంచరీ అనంతరం డి కాక్ (109) మాక్స్ వెల్ బౌలింగ్ లో రివర్సు స్వీప్ కు ట్రై చేసి బౌల్డ్ అయ్యి వెనుతిరిగారు.

 

ప్రస్తుతం సౌత్ ఆఫ్రికా మూడు వికెట్లు కోల్పోయి 232 పరుగులు చేసింది. ఇదే విధంగా బ్యాటింగ్ ను కొనసాగిస్తే ఆస్ట్రేలియా ముందు భర్తీ టార్గెట్ ను పెట్టె ఛాన్స్ ఉంటుంది.

Read more RELATED
Recommended to you

Latest news