సామర్లకోటలో సామూహిక గృహ ప్రవేశాల కార్యక్రమం సందర్భంగా ఏపీ సీఎం జగన్ జనసేనాని పవన్ కల్యాణ్ పెళ్లిళ్లపై తీవ్ర వ్యాఖ్యలు చేయడం తెలిసిందే. దత్తపుత్రుడి ఇంట్లో ఇల్లాలు మూడ్నాలుగేళ్లకు ఓసారి మారిపోతుంటుందని, ఒకసారి లోకల్, ఒకసారి నేషనల్, ఇంకోసారి ఇంటర్నేషనల్ అంటూ ఎద్దేవా చేశారు. మహిళల పట్ల దత్తపుత్రుడికి ఉన్న గౌరవం ఇదీ అంటూ విమర్శించారు. అయితే దీని పై టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
“ముఖ్యమంత్రి నిన్న ప్రస్తవించిన అంశాల్లో పవన్ కళ్యాణ్‌పై చెప్పిన వాటిల్లో అవాస్తవాలు ఉన్నాయా.. ఒక సారి పబ్లిక్ లైవ్ లోకి వచ్చాక ప్రశ్నించొచ్చు. ఆదర్శప్రాయుడు కాకపోతే ప్రజలకు సరైన రోల్ మోడల్ కాదని భావిస్తాం. ఒక వేళ ఆదర్శప్రాయుడు కాపోతే పబ్లిక్ లో కనపడకుండా ఉండాలి.
అయితే అది కాకుండా మహ పీఠాధిపతి తరహాలో సమాజం గురించి చెపితే ఎలా. పవన్ కళ్యాణ్ అంటున్నది కరెక్టే చట్టప్రకారం విడాకులు తప్పేంలేదు. అయితే అవి వరుసగా మూడు జరిగితే ఏం లోపం…. వాళ్లల్లోనా, మీలోనా, మీ ఆలోచనల్లో లోపమా అనే అనుమానం మీ చుట్టూ ఉన్నవాళ్లకు వస్తుంది. పవన్ కళ్యాణ్ అందరికి సందేశాలు ఇస్తున్నప్పుడు ప్రజలే అడుగుతారు.” అని సజ్జల అన్నారు.”జగన్ వచ్చేసరికి ఇళ్లేందుకు కట్టుకున్నారు… ఇక్కడి నుంచి ఎందుకు ఆపరేట్ చేస్తున్నారు. జగన్ కు రాష్ట్రం మీద సీరియస్ నెస్ ఉంది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఇళ్లు హైదారాబాద్‌లో కట్టుకుంటారా. ఎలా అయినా బ్రిటిష్ వాళ్లు దోచుకున్నట్టు దోచుకుని హైదారాబాద్ కు పట్టుకెళ్లాలని చూస్తున్నారు. చంద్రబాబు రాజకీయాల్లో ఏ రకంగానూ అర్హుడు కాదు.” అని సజ్జల అన్నారు.